Telangana Election Results 2023: తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరికొద్ది సేపట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెర లేవనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌ను గద్దె దించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో ఉత్కంఠ నెలకొంది. 119 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు కేంద్ర ఎన్నికల సంఘం 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 40 కేంద్ర కంపెనీ బలగాలతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేశారు. ఈ ఆంక్షలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటాయి.
Read also: Election Results 2023 Live : ఎవరి ధీమా వారితే.. మరి కాసేపట్లో తేలనున్న పార్టీల భవితవ్యం
ఈ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం నేడు తేలనుంది. ఈరోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 1766 టేబుళ్లను ఏర్పాటు చేయగా.. ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుల్స్ ఉన్నాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. 80 ఏళ్లు పైబడిన వారు, వికలాంగులు కూడా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించడంతో ఈసారి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ఉదయం 8.30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రతి 20 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో 2,32,59,256 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.. వారందరి తుది నిర్ణయం వెలువడే వరకు వేచి చూడాల్సిందే..
Astrology: డిసెంబర్ 3, ఆదివారం దినఫలాలు