Homeతెలుగు రాష్ట్రాలుSuriya 44: నాది స్వచ్ఛమైన ప్రేమ.. ‘సూర్య 44’ టైటిల్‌ టీజర్‌ వచ్చేసింది!

Suriya 44: నాది స్వచ్ఛమైన ప్రేమ.. ‘సూర్య 44’ టైటిల్‌ టీజర్‌ వచ్చేసింది!


  • సూర్య 44 టీజర్‌ వచ్చేసింది
  • నాది స్వచ్ఛమైన ప్రేమ
  • ప్రస్తుతం తమిళ టీజర్ మాత్రమే
Suriya 44: నాది స్వచ్ఛమైన ప్రేమ.. ‘సూర్య 44’ టైటిల్‌ టీజర్‌ వచ్చేసింది!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల ‘కంగువ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూర్య అభిమానులను సైతం డిసప్పాయింట్ చేసింది. సూర్య సతీమణి జ్యోతిక కూడా ఫస్టాఫ్ బాలేదని స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కమ్ బ్యాక్ ఇచ్చేందుకు హిట్ డైరెక్టర్ కార్తిక్‌ సుబ్బరాజుతో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈమూవీ చిత్రీకరణ దాదాపుగా పూర్తయింది. నేడు క్రిస్మస్‌ సందర్భంగా టైటిల్ టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Also Read: Boxing Day Test: తుది జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కొత్త ఆటగాడికి అవకాశం!

సూర్య, కార్తిక్‌ సుబ్బరాజుల సినిమాకు ‘రెట్రో’ అనే టైటిల్ ఖరారు చేశారు. హీరోయిన్ పూజా హెగ్డేతో సూర్య మాట్లాడుతున్న సీన్‌తో టీజర్‌ ఓపెన్ అయింది. నీ ప్రేమ కోసం ఈ రౌడీయిజం వదిలేస్తున్నా, నాది స్వచ్ఛమైన ప్రేమ అని సూర్య చెప్పిన డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఓవైపు యాక్షన్.. మరోవైపు లవ్ స్టోరీతో టీజర్‌ను కట్ చేశారు. ప్రస్తుతం తమిళ టీజర్ మాత్రమే రిలీజ్ చేశారు. త్వరలోనే మిగతా భాషల టీజర్స్ విడుదల కానున్నాయి. 2025 వేసవిలో రెట్రో విడుదల కానుంది. ఈ మూవీ సూర్యకు చాలా ముఖ్యం. ఎందుకంటే మూడేళ్లుగా కంగువ కోసం కష్టపడినా అందుకు తగ్గ ఫలితం రాలేదు. రెట్రోపై అతడు భారీ ఆశలు పెట్టుకున్నాడు.





Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments