- వరుసగా రెండో రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
- ఉదయం నుంచి గ్రీన్‌లో కొనసాగిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్‌లో సంక్రాంతి రోజున లాభాల బాట పట్టిన సూచీలు.. రెండో రోజుగా కూడా అదే ఊపు కనిపించింది. కనుమ రోజున కూడా ఇన్వెస్టర్ల ఉత్సాహంతో ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు.. చివరికి దాకా గ్రీన్‌లోనే ట్రేడ్ అయ్యాయి. ఇక ముగింపులో సెన్సెక్స్ 224 పాయింట్లు లాభపడి 76, 724 దగ్గర ముగియగా.. నిఫ్టీ 37 పాయింట్లు లాభపడి 23, 213 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 28 పైసలు లాభపడి 86.36 దగ్గర ముగిసింది.
నిఫ్టీలో యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫిన్‌సర్వ్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ నష్టపోగా.. ట్రెంట్, పవర్ గ్రిడ్ కార్ప్, ఎన్‌టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతి సుజుకి లాభపడ్డాయి. రంగాల పరంగా ఆటో, మీడియా, ఫార్మా 0.5-1 శాతం క్షీణించగా.. ఐటీ, రియాల్టీ, పవర్ 0.5-1 శాతం పెరిగాయి. బీఎస్‌ఇ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరిగింది.