Homeతెలుగు రాష్ట్రాలుSRH vs CSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్..

SRH vs CSK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్..



Srh

ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు హైఓల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య పోరు జరుగనుంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. చెన్నై బ్యాటింగ్ కు దిగనుంది. ఇదిలా ఉంటే.. ఎస్ఆర్హెచ్కు ఉప్పల్ స్టేడియం హోంగ్రౌండ్ అయినప్పటికీ, చెన్నైకు సపోర్ట్ గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. జట్టులోకి తెలుగు ప్లేయర్ నితీశ్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. అతనితో పాటు నటరాజన్‌కు చోటు దక్కింది. మరోవైపు.. సీఎస్కే జట్టులో మూడు మార్పులు జరిగాయి. ముస్తఫిజర్‌ రెహ్మన్‌, మతీషా పతిరాన, అజింక్య రహానే ఈ మ్యాచ్ లో ఆడటం లేదు. వీరి స్థానంలో థీక్షణ, ముఖేష్‌ చౌదరి, మొయిన్‌ అలీ ఆడుతున్నారు.

KCR: ఈ ప్రభుత్వ మాటలు అన్నీ మోసాలు, అబద్ధాలు..

సన్ రైజర్స్ ప్లేయింగ్ ఎలెవన్:
అభిషేక్ శర్మ, ఐడెన్ మర్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌ కీపర్‌), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), జయదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్.

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ ఎలెవన్:
రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, మొయిన్ అలీ, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని(వికెట్‌ కీపర్‌), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments