Skill Development Case :స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు మరోసారి చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరుతుండగా… బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై గురువారమే విచారణ జరగగా… ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం శుక్రవారానికి వాయిదా వేసింది. ఇవాళ మరోసారి చంద్రబాబు, సీఐడీ తరపు న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు… తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పు వెలువరించే అవకాశం ఉందని సమాచారం.