Homeతెలుగు రాష్ట్రాలుSanjay Raut: మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ‘‘రాష్ట్రపతి పాలన’’.. అమిత్ షాపై సంచలన ఆరోపణలు..

Sanjay Raut: మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ‘‘రాష్ట్రపతి పాలన’’.. అమిత్ షాపై సంచలన ఆరోపణలు..


  • ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన..

  • ఓటర్ల జాబితాలో బీజేపీ గోల్‌మాల్..

  • అమిత్ షాపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు..
Sanjay Raut: మహారాష్ట్ర ఎన్నికల తర్వాత ‘‘రాష్ట్రపతి పాలన’’.. అమిత్ షాపై సంచలన ఆరోపణలు..

Sanjay Raut: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో నెల మాత్రమే సమయం ఉంది. రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలకు నవంబర్ 20న ఒకే విడతలో ఎన్నికలు జరగబోతున్నాయి. 23న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. ప్రస్తుతం అన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో ఉన్నాయి. ఆదివారం బీజేపీ 99 మందితో అభ్యర్థుల తొలి లిస్టును విడుదల చేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని శివసేన(ఠాక్రే), ఎన్సీజీ(శరద్ పవార్) పార్టీల కూటమి ‘‘మహా వికాస్ అఘాడీ’’ కూడా త్వరలోనే అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.

Read Also: Baba Siddique murder: బాబా సిద్ధిక్ హత్యలో మరొకరి అరెస్ట్.. ఆయుధాలు అందించింది ఇతనే..

ఇదిలా ఉంటే, శివసేన ఠాక్రే వర్గం నేత, ఎంపీ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో ‘‘రాష్ట్రపతి పాలన’’ విధించేందుకు అమిత్ షా ప్లాన్ చేస్తున్నట్లు ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ఓటర్ జాబితాలో బీజేపీ అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం సహాయంతో బీజేపీ పోటీ చేస్తున్న 150 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ, మహా వికాస్ అఘాడీకి ఓటేసే వారిని జాబితా నుంచి తొలగించడమే కాకుండా తమకు అనుకూలంగా ఉన్న వారి పేర్లను చేరుస్తుందని ఆరోపించారు.

ఇదే కాకుండా.. ఈ విషయాన్ని తాము దేశంలోనే కాకుండా అంతర్జాతీయం వేదికలపై లేవనెత్తుతామని చెప్పారు. ఇది గాంధీ నెహ్రూల దేశమని, బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కలిగిన దేశమని, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ప్రమాదంలో ఉన్నదనే విషయాన్ని చెబుతామని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి గెలిచేది లేదని, ఓడిపోతుందని జోస్యం చెప్పారు. బీజేపీ తన మిత్రపక్షాలు షిండే, అజిత్ పవార్‌లను ఓడించాలని చూస్తోందని ఆరోపించారు.





Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments