Homeతెలుగు రాష్ట్రాలుSai Pallavi : వారి బాటలోనే సాయి పల్లవి.. హిట్టు దక్కేనా.?

Sai Pallavi : వారి బాటలోనే సాయి పల్లవి.. హిట్టు దక్కేనా.?


Sai Pallavi : వారి బాటలోనే సాయి పల్లవి.. హిట్టు దక్కేనా.?

అమరన్‌తో బాక్సాఫీస్ నయా క్వీన్‌గా మారిన సాయి పల్లవి.. ఆ నేమ్ సార్థకత చేసుకునేందుకు ట్రై చేస్తోంది. అనుష్క, నయనతార, సమంతలా ఉమెన్ సెంట్రిక్ చిత్రాలకు రెడీ అయ్యింది. తెలుగులో లేడీ ఓరియెంట్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గట్టిగానే బజ్ నడుస్తోంది. తండేల్ మూవీ రైటర్ కార్తీక్ తీర్థ చెప్పిన కథకు ఇంప్రెస్సైయ్యిందట ఈ డ్యాన్సింగ్ డాల్. ఆమె చుట్టూనే స్టోరీ తిరుగుతుందట. ఫీమేల్ ఓరియెంట్ లవ్ స్టోరీకి ఫిదా అయిపోయిందట భానుమతి.

ప్రేమమ్ తో పాపులారిటీ తెచ్చుకున్న సాయి పల్లవి తక్కువ టైంలోనే స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. లేడీ ఓరియెంట్ చిత్రాలు చేయడం ఆమెకు కొత్త కాదు. కానీ టాలీవుడ్‌లో మాత్రం ఇదే మొదటి సినిమా. కెరీర్ స్టార్టింగ్ లో తమిళంలో కణంతో పాటు గార్గి లాంటి ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేసింది. ఈ రెండు కమర్షియల్ గా హిట్స్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులను తెచ్చిపెట్టాయి. కణం, గార్గి రిజల్ట్ చూశాక కూడా రిస్క్‌కు రెడీ అవుతుంది ఈ తమిళ పొన్ను. ప్రజెంట్ తెలుగులో ఆమె చేతిలో తండేల్ ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. నాగ చైతన్యతో లవ్ స్టోరీతో హిట్టు అందుకున్న భామ తండేల్ తో మరోసారి అదుర్స్ అనిపించేందుకు ఫిక్స్ అయ్యింది. ఇవే కాకుండా బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న రణబీర్ రామాయణలో సీతగా, అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ కు జోడీగా మరో సినిమా చేస్తుంది. ఇవే కాకుండా కొత్త కథలను వింటున్నట్లు టాక్. లేడీ ఓరియెంటెడ్ సినిమా సాయి పల్లవికి హిట్ ఇస్తుందో రానున్నో రోజుల్లో తెలుస్తుంది.





Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments