Homeతెలుగు రాష్ట్రాలుRGV: ఆర్జీవీ తప్పించుకు తిరుగుతున్నాడా?

RGV: ఆర్జీవీ తప్పించుకు తిరుగుతున్నాడా?


RGV: ఆర్జీవీ తప్పించుకు తిరుగుతున్నాడా?

ఏపీ పోలీసులకు చిక్కకుండా రామ్ గోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నారా అనే ప్రశ్నకు ఎన్టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో రాంగోపాల్ వర్మ సమాధానం ఇచ్చారు. గత కొద్దిరోజులుగా రాంగోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నారు అని ప్రచారం జరుగుతోంది. కాబట్టి మీరు ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తున్నారు అని యాంకర్ ప్రశ్నించగా తాను తన నివాసమైన డెన్ నుంచే వస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే జరుగుతున్న ప్రచారం అంతా నిజం కాదా? రాంగోపాల్ వర్మ తప్పించుకు తిరుగుతున్నాడు అనే ప్రచారం నిజం కాదా అని ప్రశ్నిస్తే అబద్ధం అనేది చాలా చిన్న పదం. అబద్ధం అనేదానికి నిజానికి వ్యతిరేకం అని అనొచ్చు కానీ నేను అరిచి చెప్తున్నాను.

RGV: నాకెక్కడ గుర్తుంటాయ్.. వేల ట్వీట్లు పెట్టి ఉంటా!

మీరు అడిగారు కాబట్టి నేను చెప్పడం లేదు నేను అరిచి చెబుతున్నాను. నా ట్విట్టర్లో లైవ్ టీవీ ఇంటర్వ్యూలలో డైరెక్ట్ గా నేను ఇక్కడే ఉన్నాను అని చెబుతున్నాను. అని అన్నారు. అంతేకాక గతంలో ఒక న్యూస్ పేపర్ గురించి చెబుతూ మీడియా మీద వర్మ కామెంట్ చేశారు. ఇప్పుడు మీడియా కథలు అల్లుతున్నాయని బహుశా అందువల్లే తాను పరారీలో ఉన్నాను అనే కథనాలు వండి వార్చి ఉంటారని చెప్పుకొచ్చారు. తాను తన నివాసమైన డెన్ లో నివాసం ఉంటున్నానని ఆయన మరోసారి కుండ బద్దలు కొట్టారు.





Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments