Homeతెలుగు రాష్ట్రాలుRanjith Reddy: బడుగులకు కాంగ్రెస్​ పార్టీయే అభయహస్తం

Ranjith Reddy: బడుగులకు కాంగ్రెస్​ పార్టీయే అభయహస్తం


Ranjith Reddy: బడుగులకు కాంగ్రెస్​ పార్టీయే అభయహస్తం

Ranjith Reddy: బడుగు బలహీనవర్గాలకు కాంగ్రెస్​ పార్టీయే అభయ హస్తమని చేవెళ్ళ పార్లమెంట్ కాంగ్రెస్​ అభ్యర్థి జి. రంజిత్​ రెడ్డి చెప్పారు. గురువారం వికారాబాద్​ పట్ణణ కేంద్రంలోని గౌలికర్​ ఫంక్షన్​ హాల్​లో బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్​ గౌడ్, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్​ కుమార్​, తదితర నాయకులు​ హాజరవగా… ఎంపీ రంజిత్​ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. బీసీలకు అవకాశం, అధికారం, ఆత్మగౌరవం కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలన్న డిమాండ్​ ను కాంగ్రెస్​ పార్టీ నేరవేరుస్తుందని హామీనిచ్చారు.


ఇదిలా ఉండగా.. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ళ పార్లమెంట్​ ప్రాంతంలోని మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం సరూర్ నగర్‌లో జరిగిన కాంగ్రెస్ జనజాతరలో హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్​ రెడ్డి, తదితర నాయకులతో కలిసి రంజిత్‌ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిందని, కష్టాలు తీరుస్తుందని అన్నారు. ఈ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని రంజిత్‌ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.





Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments