- చిత్ర యూనిట్‌ను టెన్షన్ పెడుతున్న సుకుమార్
- డిసెంబర్ 5న విడుదల.. రిలీజ్‌కు ఇంకా 10 రోజులే..
- 27 నాటికి తొలికాపీ పూర్తయితేగానీ.. సెన్సార్‌కు వెళ్లని పుష్ప2
సుకుమార్ ఇంతే.. మారడు. పుష్ప అనుభవంతో అయినా మారతాడనుకుంటే..మైండ్‌సెట్ ఏమాత్రం ఛేంజ్ కాలేదు. సినిమా రిలీజ్‌కు దగ్గర పడుతున్నకొద్దీ.. టెన్షన్ పెట్టేస్తాడు. ఈ టెన్షన్‌ను చిత్ర యూనిట్ భరించలేక బీపీ.. షుగర్లు ఎక్కడొస్తాయోనని భయపడుతోంది. అసలు సినిమా వస్తుందా? లేదా? అనుమానం చక్కర్లు కొడుతుంది. పుష్పనే కాదు.. పుష్ప2 విషయంలోనూ ఇదే సీన్ రిపీట్ అయింది. నిజానికి పుష్ప 2 చిత్ర యూనిట్‌ను సుకుమార్ టెన్షన్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాను అనేక సార్లు వాయిదా వేసి ఎట్టకేలకు డిసెంబర్ 5న విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అంటే ఒకరకంగా రిలీజ్‌కు ఇంకా 10 రోజులే ఉంది. కానీ ఇప్పటికీ షూటింగ్‌లోనే నడుస్తోంది పుష్ప2. అయితే ఎట్టకేలకు లాస్ట్ సాంగ్ చిత్రీకరణ.. ఆదివారంతో పూర్తి అయింది. ఈ సాంగ్ మేకింగ్‌ను కొరియోగ్రాఫర్‌కు అప్పజెప్పేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌లో లెక్కలమాస్టారు సుకుమార్ బిజీ అయ్యాడు. ఈ క్రమంలోనే ఆయన పాట్నా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు రాలేదు.
Sambhal Violence: కోర్టు ఆదేశాలతో సంభల్‌లోని ఓ మసీదులో సర్వే.. చెలరేగిన అల్లర్లు, ఇంటర్నెట్ బంద్
27 నాటికి తొలికాపీ పూర్తయితేగానీ.. సెన్సార్‌కు పుష్ప2 వెళ్లలేని పరిస్థితి ఉంది. 6 భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అన్ని భాషల్లో ఫైనల్ కాపీలు సిద్ధం చేసి సెన్సార్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఒక రకంగా రిలీజ్‌కు నెల రోజుల ముందే రాజమౌళి సెన్సార్ పూర్తి చేసి ఒక నెల రోజులపాటు ప్రమోషన్స్‌తో బిజీ అయ్యేవాడు. కానీ సుకుమార్ మాత్రం ఇంకా ఫైనల్ కాపీ రెడీ చేయలేదు. పుష్ప రిలీజ్ టైంలోనూ ఇదే తీరుతో సుకుమార్ ఉండడంతో అప్పుడు కూడా టీం అందరిలో టెన్షన్ ఏర్పడింది. ఇక సెకండ్ పార్ట్ విషయంలో కూడా అనేక వాయిదాలు పడుతూనే వచ్చింది. ఆగస్ట్ 15న రావాల్సిన పుష్ప2 వాయిదా పడడంతో ఎంత టైం ఇచ్చినా..చివర్లో టెన్షన్ పెట్టడం, టీం పడడం కంపల్సరీ అన్నట్టు మారింది పరిస్థితి.