వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీకి మద్దతుగా కొందరు సినీ, రాజకీయ నేతలు ప్రత్యర్థులపై పరిధిదాటి మాట్లాడేవారు. ఇక సోషల్ మీడియాలో ప్రత్యర్థుల కుటుంబ సభ్యులపై అసభ్యంగా పోస్టులు పెట్టేవారు. బోరుగడ్డ అనిల్ కుమార్, శ్రీరెడ్డి, పోసాని కృష్ణమురళి, ఆర్జీవీ…ఇలా వైసీపీ మద్దతుదారులు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ పై సందర్భం దొరికితే చాలు అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడేవాళ్లు. ఆడబిడ్డలపై అసభ్య పదజాలంతో దూషణలు చేసేవారు. వీరందరికీ కూటమి సర్కార్ షాక్ లు ఇస్తుంది. సోషల్ మీడియా పరిధిదాటి ప్రవర్తించిన వారిపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తుంది. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు చేయగా.. తాజాగా పోసాని వంతు వచ్చింది.