Pooja Hegde joins Suriya 44: ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డేకు ఇటీవలి కాలంలో సరైన హిట్ లేదు. తెలుగులో ఆచార్య, రాధేశ్యామ్.. తమిళంలో బీస్ట్ నిరాశపరిచాయి. వరుస ఫ్లాప్స్ పడుతుండడంతో ఆ మధ్య గుంటూరు కారం నుంచి తప్పించారు. దాంతో ఒకప్పుడు చేతినిండా సినిమాతో బిజీగా ఉన్న పూజా.. ఇప్పుడు అవకాశాల్లేక అల్లాడుతోంది. సౌత్‌లో సినిమాలు లేకపోవడంతో హిందీలో సినిమాలు చేస్తున్నారు. అయితే పూజా ఎప్పటినుంచో సౌత్ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తోంది. తాజాగా బుట్టబొమ్మకు ఆ అవకాశం దక్కింది.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ సూర్య హీరోగా ‘సూర్య 44’ వస్తోంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుందట. పూజా హెగ్డే, సూర్య కలిసి సినిమా చేయడం ఇదే మొదటిసారి. పూజా చివరగా తమిళంలో దళపతి విజయ్ బీస్ట్ సినిమాలో నటించింది. హిందీలో సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమాలో బుట్టబొమ్మ నటించింది.
Also Read: Nandamuri Rama Krishna: రికార్డు ఓటింగ్.. తెలుగు జాతి మొత్తానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!
‘సూర్య 44’ షూటింగ్ జూన్ 2న అండమాన్ దీవులలో ప్రారంభమవుతుంది. అండమాన్ దీవులు, ఊటీ, తమిళనాడులోని ఇతర ప్రదేశాలలో 40 రోజుల సుదీర్ఘ షెడ్యూల్‌ను టీమ్ ప్లాన్ చేసింది. ఈ చిత్రంలో మలయాళ నటుడు జోజు జార్జ్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చనున్నారు.