- అధికారులు దొరల పాలనలో ఉన్నామనేది మర్చిపోండి
- ప్రజా పాలనలో ఉన్నాం
- దొరల పాలనలో ఉన్నామనుకుంటే ఈ ప్రభుత్వం ఉపేక్షించదు : పొంగులేటి శ్రీనివాస రెడ్డి
భద్రాద్రి జిల్లాలోని మణుగూరులో జరిగిన సమీక్ష సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. అధికారులు దొరల పాలనలో ఉన్నామనేది మర్చిపోండి. ప్రజా పాలనలో ఉన్నాం. దొరల పాలనలో ఉన్నామనుకుంటే ఈ ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. రాష్ట్రంలో 1251 నియోజకవర్గాల్లో కార్పోరేటర్ల తలతన్నెల ఇంటిగ్రేటెడ్ పాఠశాల శంకుస్థాపనలు చేశామని, అర్హులైన రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పామన్నారు. గత ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాలలో 13,500 కోట్లు రెండు విడుదలగా చేస్తే ఈ ప్రభుత్వం 26 రోజుల్లో 18 వేల కోట్లు రుణమాఫీ చేసిందని, ఇంకా 13 వేల కోట్లు రుణమాఫీ చేయాలని అనేక వేదికల మీద చెప్పామని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం మాట ఇస్తే మాట తప్పదు. అన్నమాట ప్రకారం రాబోయే రోజుల్లో 13 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అధికారులకు ఉందని, వరద బాధితులకు 16,500 ఇంటికి, ఎకరానికి 10,500 ఈ ప్రభుత్వం ఇచ్చిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
Salman Khan: సల్మాన్ ఇంటి వద్ద భారీ భద్రత.. 24/7 పోలీస్ పెట్రోలింగ్, AI- ఎనేబుల్డ్ సీసీటీవీల నిఘా..
అంతేకాకుండా.’భద్రాద్రి వొచ్చిన వరదల్లో జిల్లా యంత్రాంగం ప్రజలతో మమేకమై పనిచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు. వర్షాకాలం పూర్తి అయ్యేలోపు రాష్ట్రంలో ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీ ఆధ్వర్యంలో 4,000 తగ్గకుండా మొదటి విడతలో ఇంద్రమ్మ ఇల్లు కట్టిస్తాం. గత ప్రభుత్వ ఆలోచనలో ఉంటే అధికారులు పద్ధతులు మార్చుకోవాలి. ఈ ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయాలి. గత ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు పేరుతో పేదోడి సొమ్ము కొల్లగొట్టి దాచుకున్నారు ప్రాజెక్టు అసంతృప్తిగా వదిలేశారు. పినపాక నియోజక వర్గంలో పులుసు వంతు ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యాన్ని గురైన లిఫ్టులను పునరుద్దించి 15 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం. గిరిజన ప్రాంతంలో వైద్యానికి ఈ ప్రభుత్వం పెద్దపీడ వేస్తుంది.’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
AP Govt: బీసీలకు ఇచ్చిన ఎన్నికల హామీ అమలు దిశగా కూటమి సర్కారు అడుగులు!