Homeతెలుగు రాష్ట్రాలుPongal Race: సీనియర్ హీరోల పోటీ..విజయం ఎవరిని వరిస్తుందో..?

Pongal Race: సీనియర్ హీరోల పోటీ..విజయం ఎవరిని వరిస్తుందో..?


  • 2025 సంక్రాంతి సినిమాల రేస్ మొదలు
  • బరిలో స్టార్ హీరోల సినిమాలు
  • ఫుల్ జోష్ లో స్టార్ హీరోల ఫ్యాన్స్
Pongal Race: సీనియర్ హీరోల పోటీ..విజయం ఎవరిని వరిస్తుందో..?

సంక్రాంతి అంటే పల్లెటూరు అందాలు, ధాన్యం లోగిళ్లు, కోడి పందాలు, కొత్త అల్లుడుకి మర్యాదలతో పాటు ఫ్యామిలీ తో పాటు సినిమా చూడడం అనేది కూడా ఒక భాగం. పొంగల్ హాలిడేస్ కు థియేటర్లు కళకళలాడుతూ ఉంటాయి. ముఖ్యంగా B,C సెంటర్లు ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ తో హోరెత్తుతాయి. అందుకే ప్రతి సంక్రాంతికి సినిమాలు విడుదలకు ప్రతి ఒక్కరూ పోటీ పడుతుంటారు. సంక్రాంతి డేస్ అంటే సినిమాలకు గోల్డెన్ డేస్ లాంటివి. రానున్న సంక్రాంతి కూడా బాక్సాఫీస్ వద్ద సినిమాల హడావిడి ఒక రేంజ్ లో సాగేలా కనిపిస్తుంది.

2025 సంక్రాంతి సినిమాల రిలీజ్ కోసం ఇప్పటి నుండే కర్చీఫ్ వేస్తున్నారు బడా సినిమాల నిర్మాతలు. ఇప్పటికే మెగాస్టార్ చిరు హీరోగా వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ‘విశ్వంభర’ సంక్రాంతి డేట్ లాక్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది ఈ చిత్రం. ఇక మరో స్టార్ హీరో సంక్రాంతి స్టార్ అని పేరున్న నందమూరి బాలకృష్ణ, బాబీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. మొదట డిసెంబరు విడుదల అనుకున్నారు కానీ అక్కడ స్లాట్ దొరకనందున సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘వీరమాస్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. వీరితో పాటు విక్టరీ వెంకీ అనిల్ రావిపూడి తాజా చిత్రం కూడా సంక్రాంతికి విడుదుల చేస్తామని పూజ కార్యక్రమంతో షూటింగ్ మొదలెట్టిన రోజే ప్రకటించారు నిర్మాత దిల్ రాజు. ఈ చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

ఇలా టాలీవుడ్ టాప్ హీరోలు ముగ్గురు సంక్రాంతికి రానుండడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మరి ఈ సారి సంక్రాంతి పోటీలో ఏ పుంజు గెలుస్తుందో చూడాలి.

Also  Read: Anil ravipudi: షూటింగ్ స్టార్ట్ కాలేదు..రిలీజ్ డేట్ ఫిక్స్..ఏ సినిమా అంటే ..?





Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments