మెరిట్ లిస్ట్ తయారీ సుదీర్ఘ ప్రక్రియ
ఆలిండియా కోటా సీట్లలో ప్రవేశానికి గత నెల 20న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా, రాష్ట్రంలో 27న మొదలయ్యిందని, గతంలో జరిగిన విధంగానే ఈ ఏడాది కూడా కౌన్సిలింగ్ జరుగుతుందని, ఈ విషయంలో ఎటువంటి అపోహలకు తావు లేదని వర్సిటీ నిర్వాహకులు తెలిపారు. దాదాపు 9 వేల మంది అభ్యర్థుల దరఖాస్తుల్ని పరిశీలించి, అభ్యర్థుల అర్హతను నిర్ధారించి, మెరిట్ లిస్టును ప్రకటించడం… సమయంతో కూడిన పని అని, ఈ సుదీర్ఘ ప్రక్రియ వల్ల పీజీ విద్యను ఆశించే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకూడదన్న ఉద్దేశంతో తగు చర్యల్ని చేపట్టినట్లు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు.