Homeతెలుగు రాష్ట్రాలుPawan Tour : మూడంచెల వ్యూహం...! గోదావరి జిల్లాల బాటలో పవన్

Pawan Tour : మూడంచెల వ్యూహం…! గోదావరి జిల్లాల బాటలో పవన్


ఫిబ్రవరి 14వ తేదీ నుంచి టూర్…

పవన్ కళ్యాణ్ (Jansena President Pawan Kalyan)ఉభయ గోదావరి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ టూర్ సాగుతుంది. తొలి రోజు భీమవరంలో వివిధ సమావేశాలలో పాల్గొంటారు. అనంతరం అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలలో సమావేశాలు ఉంటాయని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పర్యటనలలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, స్థానికంగా ప్రభావశీలురు, ముఖ్యులతో భేటీ అవుతారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులతో సమావేశమవుతారు. నియోజకవర్గాల స్థాయిలో ఇరు పార్టీల నాయకులు, శ్రేణుల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పాటు, పొత్తు ఫలితాల ఫలాల లక్ష్యంగా భేటీలు జరుగుతాయి.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments