Homeతెలుగు రాష్ట్రాలుNadendla Manohar Arrest : విశాఖలో నాదెండ్ల మనోహర్ అరెస్ట్, పోరాటానికి సిద్ధమన్న పవన్ కల్యాణ్

Nadendla Manohar Arrest : విశాఖలో నాదెండ్ల మనోహర్ అరెస్ట్, పోరాటానికి సిద్ధమన్న పవన్ కల్యాణ్


నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం- పవన్ కల్యాణ్

విశాఖలోని టైకూన్ జంక్షన్ ను మూసివేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంటే నిరసన తెలిపి, ఆ కూడలిని తెరవాలని కోరినందుకు నాదెండ్ల మనోహర్ ను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజలకున్న సమస్యలను తీర్చాల్సిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీసులు ఇందుకు భిన్నంగా స్థానిక ఎంపీ కోసం జంక్షన్ మూసివేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆయన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకి వాస్తు దోషం ఉందని రోడ్డు మూసి వేయడం ఏమిటి? ఈ విషయాలను ప్రజా గొంతుకగా జనసేన వినిపిస్తోందన్నారు. అందులో భాగంగా ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలపాలని మనోహర్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు, వీర మహిళలు సన్నద్ధమైతే పోలీసులు ప్రవర్తించిన తీరుని ఖండిస్తున్నామన్నారు. నాదెండ్ల మనోహర్ ను, జనసేన నేతలను తక్షణమే విడుదల చేయాలని పవన్ డిమాండ్ చేశారు. ఇదే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తే విశాఖపట్నం బయలుదేరి వస్తానని, ప్రజల తరఫున పోరాడతానన్నారు.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments