MK Stalin: డీఎంకే నేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు చేపడుతున్నారు. తాజా మరో కీలక నిర్ణయం తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. అవయవ దానం చేసిన దాతలకు ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించారు.
Read Also: China: యుద్ధానికి సిద్ధమవుతున్న చైనా.. సంచలన వ్యాఖ్యలు తెరమీదకు!
ఆయన మాట్లాడుతూ.. దేశంలో అవయవ దానంలో తమిళనాడు అగ్రస్థానంలో ఉందన్నారు. విషాయ సమయంలో తమ వారి అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్థ సేవల వల్లే ఇది సాధ్యమైందని అన్నారు. మరణానంతరం అవయవ దానం చేయడం వల్ల మరికొందరి ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉందని బంధుమిత్రులకు తెలియజేయడంతో పాటు, అందుకు అంగీకరించేలా ప్రోత్సహించాలని సూచించారు.
అవయవ దాతలు, వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని గుర్తించి ఆర్గాన్ డోనర్స్ అంత్యక్రియలకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని నిర్ణయించుకున్నామని సీఎం స్టాలిన్ అన్నారు.