Homeతెలుగు రాష్ట్రాలుMitchell Marsh FIR: ఢిల్లీలో మిచెల్‌ మార్ష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. టీమిండియాపై ఆడుకుండా జీవితకాల...

Mitchell Marsh FIR: ఢిల్లీలో మిచెల్‌ మార్ష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు.. టీమిండియాపై ఆడుకుండా జీవితకాల నిషేధం..!



Mitchell Marsh

Fir On Mitchell Marsh in Aligarh: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇది ఎక్కడో కాదు మన దేశంలోనే. ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్‌లో మార్ష్‌పై కేసు నమోదు అయింది. యూపీలోని అలీఘర్‍కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త పండిట్ కేశవ్.. మిచెల్ మార్ష్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లిఖితపూర్వక ఫిర్యాదు చేయడంతో పోలీసులు మార్ష్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందుకు కారణం వరల్డ్‌కప్ ట్రోఫీపై మిచెల్ మార్ష్ కాళ్లు పెట్టడమే.

ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో భారత్‌పై గెలిచిన ఆస్ట్రేలియా ట్రోఫీ కైవసం చేసుకుంది. ఆరోసారి ప్రపంచకప్ గెలుచుకున్న ఆసీస్ ప్లేయర్స్ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే డ్రెస్సింగ్ రూమ్‌లో మిచెల్ మార్ష్ ప్రపంచకప్ ట్రోఫీపై తన పాదాలను ఉంచిన ఫోటో వైరల్‌గా మారింది. ఒక చేతిలో బీర్ బాటిల్ పట్టుకుని.. రెండు పాదాలను ప్రపంచకప్ ట్రోఫీపై ఉంచిన ఫొటో తీవ్ర విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా భారత ఫ్యాన్స్ మార్ష్ తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే అలీఘర్‍కు చెందిన పండిట్ కేశవ్ అనే ఆర్‌టీఐ కార్యకర్త.. మిచెల్ మార్ష్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read: Suryakumar Yadav: ఇది బిగ్ మూమెంట్.. చాలా సంతోషంగా ఉంది: సూర్యకుమార్

ఢిల్లీ గేట్ పోలీస్ స్టేషన్‌లో మిచెల్‌ మార్ష్‌పై పండిట్ కేశవ్ లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. మార్ష్ భారతీయ భావోద్వేగాలను కించపరిచారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రపంచకప్‌పై పాదాలు వేసి ప్రతిష్టాత్మకమైన ట్రోఫీని అవమానించడమే కాకుండా.. 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని కూడా కించపరిచారని కేశవ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. మార్ష్ భారత్‍‍లో ఆడకుండా, అలాగే టీమిండియాపై ఎక్కడా ఆడుకుండా జీవితకాల నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ.. కంప్లైంట్ కాపీని ప్రధాని మోడీ, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ కార్యాలయాలకు పంపించారు. కేశవ్ లిఖితపూర్వక ఫిర్యాదు చేయడంతో.. పోలీసులు మార్ష్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments