MallaReddy: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యానిమల్. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వైల్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ యానిమల్ ఎట్టకేలకు డిసెంబర్ 1 న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం 5 భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్ టి-సిరీస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇతరకీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ కు డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఇక వీరితో పాటు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సైతం స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు.
Mahesh Babu: మహేష్ సింప్లిసిటీ.. అంత పెద్ద ఈవెంట్ కు ఆ డ్రెస్ లో
ఇక ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ” ఈరోజు మల్లారెడ్డి యూనివర్సిటీకి యానిమల్ చిత్రబృందం వచ్చింది. మహేష్ బాబు గారు.. నేను మీ సినిమా బిజినెస్ మేన్ చూసి నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఆ సినిమా పదిసార్లు చూసి ఎంపీ అయ్యాను. సేమ్ మోడల్.. సేమ్ సిస్టమ్. రణబీర్ నీకు నేనొక విషయం చెప్తాను. అప్పట్లోనే నేను చెప్పాను.. బాలీవుడ్, హాలీవుడ్ ను.. తెలుగు హీరోలు రూల్ చేస్తారు అని.. మా తెలుగువాళ్లు చాలా స్మార్ట్. రాజమౌళి, దిల్ రాజు.. ఇప్పుడు సందీప్ వచ్చాడు. హాలీవుడ్, బాలీవుడ్ ను హిందుస్థానీ రూల్ చేస్తోంది. హైదరాబాద్ అందులో టాప్ మోస్ట్.. మా తెలుగు ప్రజలు చాలా స్మార్ట్. పుష్పతో అల్లు అర్జున్.. దుమ్మురేపాడు.. ఇప్పుడు సందీప్ మరోసారి బాలీవుడ్ లో దుమ్మురేపుతాడు. మల్లారెడ్డి యూనివర్సిటీలో నాలుగుసార్లు అశ్వమేధ యాగం జరిగింది. ఇక్కడ ఇంజనీర్లు, డాక్టర్లు తయారవుతున్నారు. ఇక్కడ ఏ సినిమా రిలీజ్ అయినా కూడా 500 కోట్లు కలక్షన్స్ వస్తాయి .. పక్కా.. ఈ సినిమా సూపర్ హిట్” అంటూ ముగించారు.