మహేష్ బాబు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అందం. అందుకే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆయన డీ గ్లామర్ గా నటించలేదు. అలా నటిస్తా అనకూడా జనాలు ఒప్పుకోరు. ఎందుకంటే సగం మంది జనాలు మహేష్‌ని చూడటం కోసం థియెటర్‌కు వస్తారు. అందుకే దర్శకులు కూడా ఈ విషయం పై చాలా క్లారిటీగా ఉంటారు. తెరమీద మహేష్ ఎంతో అందంగా చూపిస్తారు. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం మహేష్ బాబుకి ఒక టఫ్ సిచువేషన్ ఎదురైందట. ఏంటి అంటే..
ప్రజంట్ మహేష్ బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లో పాన్ వరల్డ్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. జక్కన్న సినిమా అంటే మామూలుగా ఉండదు, అందులోను సూపర్ స్టార్‌తో అంటే ఫ్యాన్స్ ఏక్స్‌పెక్టెషన్స్ పీక్స్ లో ఉంటాయి. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందంటూ, మహేష్ బాబు ఫ్యాన్స్, ఇటు రాజమౌళి ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ సినిమాలో మహేష్ బాబు చేత చాలా చాలా విన్యాసాలే చేయించబోతున్నాడట జక్కన్న.
రీసెంట్ గా వైరల్ అవుతున్న వార్త ఏంటి అంటే.. ఈ మూవీలో ఒక 20 నిమిషాల వైల్డ్ ఫైర్ అటాక్ సీన్ ఉంటుందట.. ఆ సీన్ కి మొత్తం థియేటర్స్ షేక్ అయిపోవాల్సిందే నంటా. అంతేకాదు ఈ సీన్స్ కోసం జక్కన్న ఎటువంటి డూప్ లేకుండా నిజమైన మంటల్లో మహేష్ బాబుని నటింపజేయాలని అని నిర్ణయించుకున్నారట. కానీ మొదట మహేష్ ఒప్పుకోనప్పటికి సీన్ గురించి క్లియర్ ఎక్స్‌ప్లేన్ చేయడంతో ఓకే అంటూ హామీ ఇచ్చారట. ఇందులో నిజం ఎంత ఉందో తేలినప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవుతుంది.