Homeతెలుగు రాష్ట్రాలుLalitha Jewellery: ఆగష్టు 18న సుచిత్ర సర్కిల్లో ‘లలితా జ్యువెల్లరి’ బ్రహ్మండమైన ప్రారంభోత్సవం..

Lalitha Jewellery: ఆగష్టు 18న సుచిత్ర సర్కిల్లో ‘లలితా జ్యువెల్లరి’ బ్రహ్మండమైన ప్రారంభోత్సవం..


  • ఆగష్టు 18న సుచిత్ర సర్కిల్లో ‘లలితా జ్యువెల్లరి’ ప్రారంభోత్సవం

  • తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో విశేష ఆధరణను పొందిన లలితా జ్యువెల్లరి

  • అన్ని ప్రాంతాల వారికి తక్కువ తరుగు
  • తక్కువ ధరలో నగలు ఇవ్వాలనే ఉద్దేశం- కిరణ్ కుమార్.
Lalitha Jewellery: ఆగష్టు 18న సుచిత్ర సర్కిల్లో ‘లలితా జ్యువెల్లరి’ బ్రహ్మండమైన ప్రారంభోత్సవం..

40 సంవత్సరాలకు పైగా సేవలందిస్తూ దక్షిణ భారతదేశంలో అగ్రగామిగా గుర్తింపు తెచ్చుకున్న లలితా జ్యువెల్లరి.. ఇప్పుడు తన 55వ షోరూంను హైదరాబాద్లోని సుచిత్రా సర్కిల్లో ప్రారంభిస్తోంది. తయారీ ధరకే బంగారం, వజ్రాభరణాలను అందించేందుకు సిద్ధంగా ఉంది. తద్వార ప్రజలు పెద్దమొత్తంలో తమ కష్టార్జితాన్ని ఆదా చేయొచ్చు. అంతేకాదు ప్రారంభోత్సవం సందర్భంగా మార్కెట్లోనే ఇతర షోరూంలలో లభించని సరికొత్త ‘బంగారు నగల కొనుగోలు పథకం’ను కూడా అందిస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో విశేష ఆధరణను పొందిన లలితా జ్యువెల్లరి. ఇప్పుడు సుచిత్రా సర్కిల్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మరింత చేరువయ్యేందుకు సర్వం సిద్ధమైంది. ఆగస్టు 18వ తేదీన ఇక్కడ కొత్త షోరూం ప్రారంభం కానుంది. అన్ని ప్రాంతాల వారికి తక్కువ తరుగు, తక్కువ ధరలో నగలు ఇవ్వాలనే ఉద్దేశంతో వినియోగదారుల ఆశీస్సులతో ఈ షోరూంను ఆరంభిస్తుండటం మరింత విశేషం.

“వైజాగ్, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, భీమవరం, కాకినాడ, చిత్తూరు, నెల్లూరు, గూడూరు, సూళ్లూరు పేట, గుంటూరు, శ్రీకాకుళం, గోపాలపట్నం, అనకాపల్లి, గాజువాక, విజయనగరం, అనంతపురం, ఒంగోలు, కర్నూలు, నరసారావుపేట, అమలాపురం, నిజామాబాద్, హైదరాబాద్లోని కూకట్పల్లి, సోమాజిగూడ, దిల్సుఖ్ నగర్, చందానగర్ షోరూంలకు ప్రజల నుంచి దక్కిన విశేష ఆధరణను చూసి.. దక్షిణ భారతదేశం వ్యాప్తంగా సేవలు విస్తృతం చేయాలనుకుంటున్నాం. సుచిత్రా సర్కిల్ మరియు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎక్కువ స్థాయిలో ప్రజలు మా ఇతర షోరూంలకు వచ్చి నగలు కొన్నారు. అందువల్లే మేం ఇక్కడ కొత్త షోరూంను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం’ అని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. ఎం.కిరణ్ కుమార్ చెబుతున్నారు. 113, ఏ సర్కిల్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్రా రోడ్, జీడిమెట్ల, హైదరాబాద్ అనే చిరునామాలో ఆగస్టు 18న ఉదయం 9.30 గంటలకు అతిథుల సమక్షంలో ప్రారంభోత్సవం వైభవంగా జరుగనుంది. ఈ ప్రారంభోత్సవంలో.. దుద్దిల్ల శ్రీధర్ బాబు ( ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి), ఈటెల రాజేందర్ (ఎంపీ, మల్కాజ్ గిరి), కె సి వివేకానంద గౌడ్ (ఎమ్మెల్యే, కుద్బుల్లాపూర్), మైనంపల్లి హన్మంతరావు (మాజీ ఎమ్మెల్యే, మల్కాజిగిరి), కూన శ్రీశైలం గౌడ్ (మాజీ ఎమ్మెల్యే, కుత్బుల్లాపూర్), చెరుకుపల్లి తారాచంద్రా రెడ్డి (132వ డివిజన్ కార్పొరేటర్, జీడిమెట్ల) ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. అందరికీ సాదరంగా ఆహ్వానం పలుకుతున్నామని కిరణ్ కుమార్ చెప్పారు.

Election schedule: 4 రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

లలితా జ్యువెల్లరి అందిస్తోంది సరికొత్త.. ‘ధవ వందనం’ 11 నెలల నగల కొనుగోలు పథకం!

వినియోగదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, వారు కష్టపడి సంపాదించిన డబ్బు మరింత ఆదా అవ్వాలనే ఉద్దేశంతో ఈ సరికొత్త నగల కొనుగోలు పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఇందులో విశేషం ఏంటంటే మీరు నెలనెలా కట్టే డబ్బు బంగారంగానూ ఆదా చేసుకోవచ్చు, డబ్బుగానూ ఆదా చేసుకోవచ్చు. ఏ నగ అయినప్పటికీ 50% తరుగే లేదు. అలాగే ఒక నెల ఇన్స్టాల్మెంట్లో 50 శాతం బోనస్ కలదు. కస్టమర్లు రూ.1000/ రూ.1500/ 6 J.2000 / రూ.2500 / రూ.5000 / రూ.10000.. వంటి వాయిదాలలో ఈ పథకంలో చేరి లబ్ది పొందవచ్చు.

అద్భుతమైన అవకాశం!
లలితా జ్యువెల్లరీ షోరూంలలో మార్కెట్ కంటే తక్కువ తరుగులో బంగారు నగలను అందజేస్తాం. ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని డబ్బును ఆదా చేయాలని కోరుతున్నాం.

ధరలు పోల్చి కొనండి!
వినియోగదారులకు లలితా జ్యువెల్లరి ఓ అపూర్వ అవకాశాన్ని కల్పిస్తోంది. ఇక్కడ తమకు నచ్చిన నగను ఫొటో తీసుకుని, అందుకు ఎస్టిమేట్ స్లిప్ ను తీసుకోవచ్చు. ఈ రెండింటిని పెట్టుకుని నాలుగైదు షోరూంలలో ధరలు పోల్చి చూడొచ్చు. అప్పుడు ఎక్కడ ధరలు తక్కువగా ఉన్నాయో అక్కడ కొనొచ్చు.

కస్టమర్ల కోసం
న్యాయమైన విక్రయాలు, విస్తృతమైన నగల కలెక్షన్లతో పాటు కస్టమర్లకు అవగాహన కల్పించి.. వారిలో సాధికార తను నింపాలని భావిస్తున్నాం. ‘నాకు షో బిజినెస్ పై ఆసక్తిలేదు. కానీ.. కొనుగోలుదారులతో నేరుగా కనెక్ట్ కావాల ని అనుకుంటున్నా. అందుకే.. నా ప్రకటనలన్నీ కస్టమర్లకు మరింత అవగాహన కల్పించే విధంగానే ఉంటుంది. సాధారణంగా నగల విక్రయరంగంలో పారదర్శకత, ఫెయిర్ నెస్ ఉండదు. కానీ వాటిని మార్చాలని భావిస్తున్నా’ అని చెబుతున్నారు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్.ఎం. కిరణ్ కుమార్.

ఆశ్చర్యపరిచే, అద్భుతమైన నాణ్యత
నాణ్యమైన నగలు విక్రయించడం, పారదర్శకమైన విధానాన్ని లలితా జ్యువెల్లరి అనుసరిస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే. అది మాత్రమే మా ప్రత్యేకత కాదు.. విస్తృతమైన కలెక్షన్లు కూడా మా ప్రత్యేకత, చెయిన్, గాజులు, నెక్లస్, చోకర్స్, హారం, వంకీ, ఒడ్డాణం, ఉంగరాలు, కమ్మలు, జుమ్కీలుతో పాటు పలురకాల నగలు లక్షలా ది సంఖ్యలో మా కొత్త షోరూంలలో ఉన్నాయి. దేశంలోనే అతితక్కువ ధరకు వజ్రాభరణాలు లభ్యమవుతాయి. అన్ని వజ్రాభరణాలు ఈ-ఎఫ్ కలర్రోడ్, వీవీఎస్ క్లారిటీతో ఉంటాయి. నాణ్యత తక్కువైన జీ-హెచ్ కలర్డ్ ను మేం విక్రయించం. అన్ని వజ్రాభరణాలకు మార్పిడికైతే 100% బైబ్యాక్ ఉంది. బంగారంగా 90% లేదా డబుల్ గా అయితే (మార్చుకునే రోజునాటి లలితా జ్యువెల్లరి ధర ప్రకారం) 85% బైబ్యాక్ లభిస్తుంది. అలాగే కనువిందు చేసే సంప్రదాయ మరియు వినూత్నమైన 99% వెండి వస్తువులకు తరుగు లేదు. మార్కెట్ కంటే తక్కు వ ధరకు లభిస్తాయి.

చైర్మన్ మార్గనిర్దేశంతో..
నేను చాలా పేద కుటుంబంలో జన్మించా. అంతేకాకుండా సాధారణ వ్యక్తికి సరైన ధరలో నగలు కొనడమనేది ఓ పెద్ద ఛాలెంజ్ అనే విషయం నాకు బాగా తెలుసు. నగల రంగంలో ఉచితాలు, బహుమతులు, డిస్కౌంట్ల పేర్లతో కస్టమర్లను కన్ఫ్యూజ్ చేస్తుంటారు. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు విలువ నాకు బాగా తెలుసు. అందుకే కస్టమర్లకు నేను అవగాహన కల్పిస్తుంటానని చెబుతున్నారు డాక్టర్ కిరణ్ కుమార్.

అదనపు వివరాలకు సంప్రదించగలరు:
లలితా జ్యువెల్లరి, సుచిత్రా సర్కిల్: 113, ఏ సర్కిల్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్రా రోడ్, జీడిమెట్ల, హైదబాద్
ఫోన్: 040 27035555/27845555 / 8925848140/41

Laitha Jewellary Suchitra





Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments