- ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల కాలంలో ఒకే పార్టీలో ఏచూరి నిలబడ్డారు..
-
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
KTR: ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల కాలంలో ఒకే పార్టీలో ఏచూరి నిలబడ్డారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సీపీఎం జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. సిద్ధాంతం చుట్టూ నిలబడ్డ నిబద్ధత కలిగిన నాయకుడు సీతారాం ఏచూరి అన్నారు. ఎప్పుడు ఏ కండువా మారుస్తారో తెలియని ఫిరాయింపుల కాలంలో ఒకే పార్టీలో ఏచూరి నిలబడ్డారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్నత కుటుంబంలో పుట్టి అణగారిన వర్గాల కోసం పోరాడారని తెలిపారు. ప్రశ్నించడమే ప్రజాస్వామ్యం అని నమ్మిన వ్యక్తి ఏచూరి అని తెలిపారు. పార్టీలు సిద్ధాంతాలు వేరు కావచ్చు కానీ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డలుగా మాది రక్త సంబంధం అన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు మౌనంగా ఉండటం ప్రమాదం అని ఏచూరి చెప్పారని వెల్లడించారు. ఏచూరి చెప్పిన సిద్ధాంతాలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డప్పుడు మేము పోరాడుతామన్నారు. సీతారాం ఏచూరి జీవితం మా లాంటి యువతరానికి స్పూర్తిదాయకమని తెలిపారు. సీపీఎం తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీపీఎం నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, మాజీ మంత్రి కేటీఆర్, ఎంఎల్సీ కోదండరాం, పలువురు సిపిఎం నేతలు హాజరయ్యారు. కాసేపట్లో ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.
Khairatabad Ganesh: హుస్సేన్ సాగర్ నుంచి ఖైరతాబాద్ గణపతి అవశేషాల తొలగింపు..