ఈ ఏడాది ఎక్కువగా వినిపిస్తున్న ఏఐ టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ టెక్నాలజీ వచ్చిన అతి కొద్ది కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది.. టెక్నాలజీ ని వాడుకొనేవారు కొంతమంది అయితే.. దుర్వినియోగం చేసేవారు మరికొంతమంది ఉన్నారు.. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలకు ఇది పెద్ద ఇబ్బందిగా మారింది.. వారి ఫేస్‌లను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వదులుతూ వారి పరువు తీస్తున్నారు కొందరు నెటిజన్లు. ఏఐ కేటుగాళ్లకి సెలబ్రిటీలే టార్గెట్ అవుతున్నారు. ఇప్పటికే రష్మిక మందన్నా, అలియా భట్, కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా వంటి స్టార్ హీరోయిన్లు దీనికి బలయ్యారు.. రష్మిక డీప్ ఫేక్ వీడియో చేసిన వారిని ఇటీవలే అరెస్ట్ చేశారు..
ఇక ఇప్పుడు వారి ఖాతాలో మరో హీరోయిన్ బలి అయ్యింది.. ఆదిపురుష్ సినిమాతో వరల్డ్ స్టార్ గా పాపులర్ అయిన హీరోయిన్ కృతిసనన్ ఫేస్‌ని యాడ్ చేసి సోషల్ మీడియాలో వదలగా అది చర్చనీయంశంగా మారింది.. ఇందులో సిల్వర్ కలర్ డ్రెస్సు ధరించిన లేడీ చాలా బోల్డ్ గా అందాలను చూపిస్తూ ఉంది. ఆమె ఫేస్‌కి కృతి ఫేస్ ను యాడ్ చేయగా అది ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. దీనిపై ఆమె అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. వారిని విమర్శలు గుప్పిస్తున్నారు. ఏఐ కేటుగాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు..
కృతి సనన్ తెలుగు ఇండస్ట్రీలోకి మహేశ్ బాబు వన్ నేనొక్కడినే సినిమా తో పరిచయం అయింది. ఆ తర్వాత నాగ చైతన్య దోచెయ్ మూవీలో హీరోయిన్‌గా నటించింది. ఈ రెండు సినిమాలు అప్పట్లో బాగా ఆడకపోయేసరికి కృతికి తెలుగులో అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్‌లోకి వెళ్లిపోయిన ఈ బ్యూటి అక్కడ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇటీవలే ప్రభాస్ సరసన సీతగా ఆదిపురుష్ మూవీలో నటించి ఆకట్టుకుంది… ప్రస్తుతం బాలీవుడ్ సినిమాల పై ఫోకస్ పెట్టింది..