- మంత్రి కొండా సురేఖపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం
- కొండా సురేఖ ఆరోపణలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్
- అక్కినేని నాగార్జున పిటిషన్‌ను పరిగణలోకి తీసుకున్న కోర్టు.
మంత్రి కొండా సురేఖకు మరో దెబ్బ తగిలింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పిటిషన్‌ను నాంపల్లి కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకుంది. ఈ క్రమంలో.. వెంటనే కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణల మీద క్రిమినల్ చర్యలు చేపట్టాలని నాగార్జున నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో వాదనలు జరిగాయి. ఈ క్రమంలో కొండా సురేఖపై నాగార్జున వేసిన పరువు నష్టం పిటిషన్‌ను ప్రజా ప్రతినిధుల కోర్టు కాగ్నిజన్స్‌లోకి తీసుకుంది. దీంతో.. మంత్రి కొండా సురేఖ 12 తేదీన హాజరు కావాలని ఆదేశం ఇచ్చింది.