- మహా కుంభమేళాపై అటాక్ చేస్తాం..
- హిందుత్వాన్ని నాశనం చేస్తాం..
- ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్ హెచ్చరిక..
- అంత సీన్ లేదన్న అఖాడా పరిషత్..
Khalistani terrorist: ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత్‌ని బెదిరించాడు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరగబోయే ‘‘మహా కుంభమేళా’’పై దాడులు నిర్వహించి, భగ్నం చేస్తామని బెదిరింపులు జారీ చేశాడు. ఒక వీడియోలో పన్నూ మాట్లాడుతూ.. హిందుత్వ భావజాలాన్ని వ్యతిరేకించడానికి, హిందుత్వాన్ని చంపడానికి ‘‘ప్రయాగ్‌రాజ్ ఛలో’’కి పిలుపునిచ్చాడు. లక్నో, ప్రయాగ్ రాజ్ ఎయిర్‌పోర్టుల్లో ఖలిస్తానీ, కాశ్మీర్ జెండాలను ఎగురవేయాలని ఆయన తన మద్దతుదారులను కోరారు. ‘‘మహాకుంభ్ ప్రయాగ్‌రాజ్ 2025 యుద్ధభూమిగా మారుతుంది’’ అని ప్రకటించారు.
Read Also: Bengaluru Shocker: పిల్లలకు విషమిచ్చి, భార్యతో సహా సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
10 రోజుల వ్యవధిలో కుంభమేళాని టార్గెట్ చేస్తూ పన్నూ బెదిరించడం ఇది రెండోసారి. గతంలో వీడియోలో మకర సంక్రాంతి (జనవరి 14), మౌని అమావాస్య (జనవరి 29), మరియు బసంత్ పంచమి (ఫిబ్రవరి 3)తో సహా మతపరమైన ముఖ్యమైన స్నానాలు ఆచరించే రోజులను దెబ్బతీస్తామని హెచ్చరించాడు.
పన్నూన్ వీడియోని అఖిల భారతీయ అఖాడా పరిషత్ తీవ్రంగా ఖండించింది. పరిషత్ అధ్యక్షుడు మహంత్ రవీంద్రపూరి మాట్లాడుతూ.. పన్నూ బెదిరింపులను తోసిపుచ్చాడు, అతడివి పిచ్చివాడి వ్యాఖ్యలుగా కొట్టిపారేశారు. ‘‘పన్నూన్ అనే వ్యక్తి మన మహాకుంభమేళాలోకి ప్రవేశించడానికి ధైర్యం చేస్తే, అతడిని కొట్టి బయటకు పంపుతారు. ఇలాంటి పిచ్చివాళ్లను వందలాది మందిని చూశాం’’ అని అన్నారు. ‘‘మహంత్ హిందువులు, సిక్కుల మధ్య ఐక్యతను నొక్కిచెప్పారు. ఇది సిక్కులు, హిందువులు ఐక్యంగా ఉండే మాగ్ మేళా. విభజనను ప్రేరేపించడానికి పన్నూన్ చేసిన ప్రయత్నాలు ఫలించవు. మన సనాతన సంప్రదాయాన్ని సజీవంగా ఉంచింది సిక్కు సమాజం, వారు సనాతన ధర్మాన్ని కాపాడారు’’ అని అన్నారు.