Homeతెలుగు రాష్ట్రాలుKCR : ఈ సారి మోడీ వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు 400 అవుతాయి

KCR : ఈ సారి మోడీ వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు 400 అవుతాయి



Kcr

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్‌ చేపట్టిన బస్సు యాత్ర ఇవాళ సిద్దిపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా అంబేడ్కర్‌ చౌరస్తాలో కార్నర్‌ మీటింగ్‌లో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఒకనాడు ఇదే అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ పోతుంటే ధైర్యం ఇచ్చి పంపిన గడ్డ సిద్దిపేట అడ్డ అని ఆయన అన్నారు. సిద్దిపేట కన్నబిడ్డను కాబట్టి సిద్దిపేట కి వందనమని, ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు మీ ముందు ఉన్నాయన్నారు కేసీఆర్‌. బీజేపీ అజెండాలో ఏనాడు పేదల అవస్థలు ఉండవు…ఎంతసేపు అది పెట్టుబడిదారుల పార్టీ, కార్పొరేట్ పార్టీ అని, బీజేపీ ప్రభుత్వం వస్తే 15 లక్షలు ఇస్తానన్నారు వచ్చాయా..? అని ఆయన ప్రశ్నించారు. ఈ సారి మోడీ వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు 400 అవుతాయని, బీజేపీ పార్టీ మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్దిపొందాలని చూస్తుందన్నారు కేసీఆర్‌. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని, మహిళలకు ఉచిత బస్సు పథకం ఫెయిల్ అయిపొయిందన్నారు కేసీఆర్‌.

అంతేకాకుండా..’కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. డిసెంబర్ 9నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్న రేవంత్ మాట తప్పాడు. 4 వేల పెన్షన్ వచ్చిందా…? ఇక రాదు కూడా. ఆనాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిద్దిపేట జిల్లా చేయమంటే చేయలేదు. నేనే సీఎం అయిన తర్వాత సిద్దిపేట జిల్లా అయ్యింది. సిద్దిపేటకి రైలు, నీళ్లు తెచుకున్నాం. సిద్దిపేట జిల్లా రద్దుకు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది. సిద్దిపేట జిల్లా ఉండాలా..? వద్దా..? ఈ మూర్ఖపు ప్రభుత్వం, సీఎం అనేక కుట్రలు చేస్తున్నారు. వెంకట్రామిరెడ్డి కి సిద్దిపేట నుంచే మెజార్టీ లక్ష ఓట్లు ఇవ్వాలి. సిద్దిపేట జిల్లాకు కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి ఎంతో సేవ చేశారని కేసీఆర్‌ గుర్తు చేశారు. హరీశ్‌రావు నాయకత్వంలో సిద్దిపేట జిల్లాలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకున్నామని.. ఆ అభివృద్ధి కొనసాగాలంటే.. మన హక్కులు రావాలంటే.. మన నీళ్లు మనకే ఉండాలంటే.. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో హరీశ్‌రావుకు ఇచ్చిన మెజార్టీ కంటే ఇంకో 20 వేల మెజారిటీ ఇచ్చి.. అంటే ఒక లక్ష మెజార్టీతో వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు. సిద్దిపేట జిల్లా మెజార్టీతోనే వెంకట్రామిరెడ్డి ఎంపీగా గెలిచిపోయారని ధీమా వ్యక్తం చేశారు.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments