IPL 2024 Auction: ఐపీఎల్ 2024 వేలం డిసెంబర్ 19న దుబాయ్‌లో జరగనుంది. ఇందుకోసం 333 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. అంటే 333 మంది ఆటగాళ్లను వేలంలో వేలం వేయనున్నారు. మిచెల్ స్టార్క్ 8 ఏళ్ల తర్వాత ఐపీఎల్ వేలంలో కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే.. ఈసారి జరిగే వేలంపాటలో ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు డిమాండ్ పలుకనున్నారు. కాగా.. ఈ 333 మంది ఆటగాళ్ల జాబితాలో యువ ఆటగాళ్లు, సీనియర్ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
క్వేనా మఫాకా ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కుడు. క్వేనా మఫాకా దక్షిణాఫ్రికాకు చెందినాడు. ఈ ఆటగాడు అండర్-19 ప్రపంచకప్‌లో తన ఆటతో దుమారం రేపాడు. క్వీనా వయసు ప్రస్తుతం 17 ఏళ్లు మాత్రమే. అతను 8 ఏప్రిల్ 2006న జన్మించాడు. 2022లో ఆడిన U19 ప్రపంచ కప్‌లో లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ క్వీనా బౌలింగ్ తో విధ్వంసం సృష్టించాడు.. దీంతో అతన్ని రబాడ పార్ట్-2 అని పిలిచారు.
వేలానికి ఎంపికైన 333 మంది ఆటగాళ్లలో క్వీనా అతి పిన్న వయస్కుడు కాగా.. ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ మహ్మద్ నబీ అత్యంత వయోవృద్ధుడు. అతని వయస్సు 39 సంవత్సరాలు ఉంది. అతను ఐపీఎల్ లో ఇంతకు ముందు.. KKR, SRH తరుఫున ఆడాడు.
IPL 2024 వేలం వివరాలు
తేదీ- 19 డిసెంబర్ 2023 (మంగళవారం)
సమయం- మధ్యాహ్నం 2.30గం
మొత్తం ఆటగాళ్లు – 333 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ నిర్వహించబడుతుంది
భారత ఆటగాళ్లు- 219
విదేశీ ఆటగాళ్లు- 114
అతి పిన్న వయస్కుడైన క్రీడాకారుడు- క్వేనా మఫాకా
అత్యంత ఎక్కువ వయస్సున్న ఆటగాడు- మహ్మద్ నబీ