కొండ చర్యలు విరిగిపడకుండా రక్షణ చర్యలను ఏర్పాటు చేసే పనుల్లో భాగంగా ఘాట్‌రోడ్ రాకపోకలపై ఆంక్షలు విధించినట్టు అధికారులు తెలిపారు. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు కనకదుర్గానగర్ మీదుగా కొండపైకి వెళ్లాల్సి ఉంటుంది. వీవీఐపీలు, సిబ్బంది కూడా అదే మార్గంలో రావాలని ఈవో విజ్ఞప్తి చేశారు. వినాయకగుడి, స్నానాల రేవు నుంచి కనకదుర్గానగర్ వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు.