- ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్
-
న్యూజిలాండ్తో మొదటి మ్యాచ్ -
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. న్యూజిలాండ్తో మొదటి మ్యాచ్ ఆడనుంది. న్యూజిలాండ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో.. భారత జట్టు ముందుగా బౌలింగ్ చేయనుంది. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ జట్లు తలపడనున్నాయి. భారతదేశం అగ్రశ్రేణి ఆటగాళ్లు హర్మన్‌ప్రీత్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, దీప్తి శర్మ మంచి ప్రదర్శన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారత్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగుతుంది. ఎక్కువ స్పిన్నర్లపై ఆధారపడనుంది. మరోవైపు.. న్యూజిలాండ్ జట్టులో సీనియర్ ప్లేయర్స్ సహా.. యువ ఆటగాళ్లు ఉన్నారు. కాగా.. తొలి మ్యాచ్‌లో గెలవాలని భారత్ కోరుకుంటుంది.
Bhupathi Raju Srinivasa Varma: సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన బీజేపీ.. అంతా వారి వల్లే..!
భారత జట్టు: షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రాకర్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన, రేణుకా ఠాకూర్ సింగ్.
న్యూజిలాండ్ జట్టు: సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, అమేలియా కర్, సోఫీ డివైన్ (సి), బ్రూక్ హాలిడే, మేడీ గ్రీన్, ఇసాబెల్లా గేజ్ (WK), జెస్ కెర్, రోజ్మేరీ మెయిర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్.