Hyderabad ORR Accident: ఔటర్ రింగ్ రోడ్ పై ఓ కారు బీభత్సం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా నార్సింగి వద్ద వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ఓఆర్‌ఆర్‌పై నుంచి కిందికి పడిపోయింది. దీంతో ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. వీరంతా చందనగర్ వాసులుగా గుర్తించారు. గచ్చిబౌలిలో పార్టీ చేసుకొని వస్తున్నారని తెలిపారు. కారులో 5 గురు ఫ్రెండ్స్ ప్రయాణిస్తున్నరని తెలిపారు. ఇందులో మృతి చెందిన వ్యక్తి వంశీగా గుర్తించారు. మరో నలుగురు.. సాయి కిరణ్, మధన్, శ్రీశైలం, చందక రాము తీవ్ర గాయాలయ్యాయి. కారును మదన్ నడుపుతున్నట్లు సమాచారం. అయితే మదన్ ఫుల్ గా మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేశాడని స్నేహితులు తెలిపారు. మదన్ కారు నడుపుతున్నప్పుడు బ్రీతింగ్ 68 % ఉన్నట్లు గమనించారు.
Read also: Alla Ramakrishna Reddy: సొంతగూటికి మంగళగిరి సీనియర్ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి..?
అయితే.. కారు ప్రమాదానికి గురైనప్పుడు 170+ స్పీడ్ లో ఉందని తెలిపారు. ఐదు మందిలో నలుగురు మద్యం సేవించామని మృతి చెందిన వంశీ అనే యువకుడు తాగలేదని వాపోయారు స్నేహితులు. కారు ప్రమాద ఘటనపై మాకు అర్దరాత్రి 1.30 గంటలకుకాల్ వచ్చిందని తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్డుపై నుండి ఫారెస్ట్ ఏరియాలో కారు కింద దూసుకెళ్లిందని సమాచారం అందింది. దీంతో హుటాహుటిన కొందరు స్నేహితులు అక్కడకు చేరుకున్నాము. అయితే అప్పటికే వంశీ మృతి చెందాడని, మిగతా నలుగురుకి తీవ్ర గాయాలయ్యాయని వారిని ఆంబుల్స్ సహాయంతో పోలీసులు తరలిస్తున్నట్లు తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్డు పై నుండి అత్యంత వేగంగా అటవీ ప్రాంతంలోకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారని కన్నీరుమున్నీరయ్యారు. ఈ ప్రమాదా విషయాన్ని స్నేహితుల కుటుంబ సభ్యులకు తెలియజేశామన్నారు. పార్టీకి వెళుతున్నామని వెళ్లిన వంశీ తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడని గుండెలు పగిలేలా రోదించారు. మిగతా నలుగురిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయని, మిగితా ముగ్గురి పరిస్థితి కాస్త నిలకడగా ఉందని తెలిపారు. అయితే వీరు కోలుకున్న అనంతరం అసలు ఏం జరిగింది అనేదనే వివరాలు ముందుకు వస్తాయని తెలిపారు.
Local Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. మూడు రోజుల పాటు లోకల్ హాలీడేస్..