Homeతెలుగు రాష్ట్రాలుGuntur Kaaram : గుంటూరు కారం సినిమా పై ఆసక్తికర ట్వీట్ చేసిన షారుఖ్ ఖాన్..

Guntur Kaaram : గుంటూరు కారం సినిమా పై ఆసక్తికర ట్వీట్ చేసిన షారుఖ్ ఖాన్..


Guntur Kaaram : గుంటూరు కారం సినిమా పై ఆసక్తికర ట్వీట్ చేసిన షారుఖ్ ఖాన్..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం.. ఈ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించారు.ఈ సినిమాలో మీనాక్షి చౌదరీ మరియు శ్రీలీల హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, రావు రమేశ్ మరియు జగపతి బాబు ముఖ్య పాత్రలు పోషించారు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ఎంతో గ్రాండ్ గా విడుదలయింది.ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి సూపర్ హిట్ టాక్ వస్తుంది.. అంతేకాకుండా మొదటి రోజు ఈ ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా.. పండక్కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారని మహేష్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమాలో మాస్ కమర్షియల్ అంశాలతో పాటు అమ్మ సెంటిమెంట్,ఎమోషన్ తో ఎంతగానో మెప్పించారు. మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.94 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీపై బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఆసక్తికర ట్వీట్ చేశారు.


గుంటూరు కారం కోసం ఎదురుచూస్తున్నాను. నా స్నేహితుడు మహేష్ యాక్షన్ అండ్ మాస్ రైడ్ ఇది.’ అంటూ గుంటూరు కారం ట్రైలర్ ను షేర్ చేశారు. ప్రస్తుతం షారుఖ్ చేసిన ట్వీట్ నెట్టింట బాగా వైరలవుతుంది. మహేష్ గురించి షారుఖ్ పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బాద్ షా నటించిన జవాన్ గురించి మహేష్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ‘బ్లాక్ బస్టర్ హిట్ జవాన్. అట్లీ.. కింగ్ తో కింగ్ సైజ్ వినోదాన్ని అందించాడు. షారుఖ్ క్రేజ్, చరిష్మా మరియు స్క్రీన్ ప్రెజన్స్ సాటిలేనివి. జవాన్ తో తన రికార్డ్స్ తనే బ్రేక్ చేస్తాడు. చాలా బాగుంది. ‘ అంటూ మహేష్ ట్వీట్ చేయగా.. షారుఖ్ స్పందిస్తూ ధన్యవాదాలు కూడా తెలిపాడు. ఇదిలా ఉంటే గతేడాది షారుఖ్ వరుసగా మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.వాటిలో పఠాన్, జవాన్ సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అయితే ఆ తరువాత వచ్చిన డంకీ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. కానీ షారుఖ్ తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు.





Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments