YCP అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా 2021-2022 కి APERC ఆమోదించిన True- Up Charges రూ. 3,082 కోట్లను జగన్ రెడ్డి హయాంలోనే వసూలు చేశారని, తరువాత 2022-2023 కి APERC ఆమోదించిన True- Up Charges రూ. 6,073 కోట్లను, 2023-2024 కి APERC ఆమోదించిన True- Up Charges రూ. 9,412 కోట్లను జగన్ రెడ్డి హయాంలోనే ప్రజలపై విధించాల్సి ఉండగా… ఎన్నికల ముందు ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని వాయిదాల పర్వంతో కమిషన్ రద్దు అయ్యే వారం ముందు ఆమోదం తెలిపినట్లు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వివరించారు.