వెల్లుల్లి ఆహారం రుచిని పెంచడమే కాకుండా దానిని పురాతన కాలం నుంచి ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అయితే వెల్లుల్లి తొక్కలను మీరు పనికిరావని భావించి పారేస్తున్నారా.. ఇక నుంచి తెలుసుకోండి వెల్లుల్లి లాగానే వెల్లుల్లి తొక్కలతో కూడా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వెల్లుల్లి పీల్స్‌లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ-వైరస్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని సూప్‌లు, కూరగాయలలో వాడవచ్చు. వెల్లుల్లి తొక్కల వల్ల ఉబ్బసం, పాదాలలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి తొక్కల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవెంటో తెలుస్తే మీరు వాటిని పడేయకుండా ఉంటారు. ఇంతకీ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
UP fire: ఘజియాబాద్‌లో పేలిన జనరేటర్.. 4 ఫ్లాట్‌లు దగ్ధం
ఉబ్బసంలో ప్రయోజనకరంగా ఉంటుంది
ఆస్తమా రోగులు వెల్లు్ల్లి తొక్కలు తీసుకుంటే వారు ఆస్తమా నుండి గొప్ప ఉపశమనం పొందుతారు. ఇందుకోసం వెల్లుల్లి తొక్కలను మెత్తగా రుబ్బుకుని తేనెతో కలిపి ఉదయం, సాయంత్రం సేవించాలి.
చర్మ సమస్యలను తొలగిస్తాయి
దురద, తామర మొదలైన చర్మ సమస్యలు ఉన్నవారు వెల్లుల్లి తొక్క వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని కోసం.. వెల్లుల్లి తొక్కలను నీటిలో కొన్ని గంటలు నానబెట్టండి. ఈ నీటితో మీ ప్రభావిత శరీర భాగాలను శుభ్రం చేయండి. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఇది చర్మంపై దురద, చికాకు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.
పాదాల వాపును తగ్గిస్తుంది
వెల్లుల్లి తొక్కలు పాదాలలో వాపు మరియు నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. వెల్లుల్లి తొక్కలను నీటిలో వేసి మరిగించి.. గోరువెచ్చగా ఉన్నప్పుడు పాదాలను ఈ నీటిలో కొంత సమయం పాటు ఉంచండి.
జుట్టు సమస్యలను తగ్గిస్తుంది
వెల్లుల్లి తొక్కలు సాధారణ జుట్టు సమస్యలను తొలగిస్తుంది. ఇందుకోసం వెల్లుల్లి తొక్కలను నీళ్లలో వేసి మరిగించి, చల్లారిన తర్వాత జుట్టుకు పట్టించండి లేదా గ్రైండ్ చేసి దాని పేస్ట్ ను తలకు పట్టించాలి. ఇది జుట్టు మూలాల్లో చుండ్రు, దురద నుండి ఉపశమనం అందిస్తుంది.
ఆహారంలో వెల్లుల్లి తొక్కలను ఉపయోగించడం
వెల్లుల్లి తొక్కలను మూలికలు అధికంగా ఉండే సూప్‌లు, సుగంధ ద్రవ్యాలు లేదా కూరగాయలలో ఉపయోగించవచ్చు. దీనిని పులావ్ లేదా ఫ్రైడ్ రైస్‌లో కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం, వెల్లుల్లి తొక్కలను నీటిలో ఉడకబెట్టి, ఆపై అవసరాన్ని బట్టి వాడండి.