Homeతెలుగు రాష్ట్రాలుGame Changer: ఎంతైనా రామ్ చరణ్ నిజమైన ‘గేమ్ చేంజర్’ అబ్బా!

Game Changer: ఎంతైనా రామ్ చరణ్ నిజమైన ‘గేమ్ చేంజర్’ అబ్బా!


Game Changer: ఎంతైనా రామ్ చరణ్ నిజమైన ‘గేమ్ చేంజర్’ అబ్బా!

రిలీజ్ కంటే ముందే రామ్ చరణ్ తేజ అనేక రికార్డులు బద్దలు కొట్టే విధంగా దూసుకుపోతున్నాడు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికా బయలుదేరి వెళ్లారు రామ్ చరణ్, సినిమా నిర్మాత దిల్ రాజు. తాజాగా రామ్ చరణ్ కటౌట్ ఒకటి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అదేంటంటే విజయవాడలో రామ్ చరణ్ అతిపెద్ద కటౌట్ ఒకటి లాంచ్ చేస్తున్నారు. బృందావన్ కాలనీలో ఉన్న వజ్రా గ్రౌండ్స్ లో 250 అడుగుల భారీ గేమ్ చేంజర్ రామ్ చరణ్ కటౌట్ లాంచ్ చేయబోతున్నారు.

Ponguleti Srinivasa Reddy: కాపలా కుక్కలు.. వేట కుక్కలుగా మారి భూ దోపిడి చేశాయి

ఇది ఇండియాలోనే ఒక లార్జెస్ట్ కటౌట్ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు 230 ఫీట్లతో రికార్డు ఉండేది. దాన్ని మరో 20 అడుగులతో ఈ రాంచరణ్ కటౌట్ బ్రేక్ చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.Ram Charan Poster





Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments