సీఎస్, డీజీపీతో భేటీ
కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఏపీలో రెండో రోజు పర్యటిస్తున్నారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024, ఎన్నికల సన్నద్ధతపై ఈసీ అధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. పోలింగ్ సన్నద్ధత, ఓటర్ల జాబితా, భద్రతా ఏర్పాట్లపై చర్చిస్తున్నారు. శుక్రవారం 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించిన ఈసీ బృందం… శనివారం మరో 8 జిల్లాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ లో భద్రతా ఏర్పాట్లు, చెక్‌పోస్టులు, తనిఖీ కేంద్రాల ఏర్పాటుపై ఆరా తీస్తున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎలాంటి పర్యవేక్షణ ఉండాలన్న దానిపై రాష్ట్ర ఎన్నికల అధికారులకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఇవాళ సీఎస్, డీజీపీ, ఇతర శాఖల ఉన్నతాధికారులతో ఈసీ అధికారులు భేటీ కానున్నారు.