Homeతెలుగు రాష్ట్రాలుDonald Trump: మెక్‌డొనాల్డ్స్‌లో చెఫ్‭గా మారిన డొనాల్డ్ ట్రంప్(వీడియో)

Donald Trump: మెక్‌డొనాల్డ్స్‌లో చెఫ్‭గా మారిన డొనాల్డ్ ట్రంప్(వీడియో)


  • ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్న రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.
  • పెన్సిల్వేనియాలోని మెక్‌డొనాల్డ్స్‌లో.
  • చెఫ్‭గా మారిన డొనాల్డ్ ట్రంప్.
Donald Trump: మెక్‌డొనాల్డ్స్‌లో చెఫ్‭గా మారిన డొనాల్డ్ ట్రంప్(వీడియో)

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. అయితే తాజాగా అతను తన బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయం తీసుకున్నాడు. దాంతో పెన్సిల్వేనియాలోని మెక్‌డొనాల్డ్స్‌లో ఆగాడు. ఈ సమయంలో అతను ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి ప్రయత్నించాడు. “నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ పని చేయడం కూడా చాలా ఇష్టం” అని అన్నారు. అలాగే కమల హరీష్ కంటే 15 నిమిషాలు ఎక్కువ పనిచేశానని ట్రంప్ అన్నారు.

Read Also: Indian UPI In Maldives: మాల్దీవులలో ఇకపై ఇండియన్ యూపీఐ.. మొహమ్మద్ ముయిజ్జూ కీలక నిర్ణయం

ఇకపోతే ప్రస్తుతం ట్రంప్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో అతను మెక్‌డొనాల్డ్స్ ఉద్యోగులతో మాట్లాడటం, అలాగే ఫ్రైస్ చేయడం చూడవచ్చు. దీని తర్వాత అతను రెస్టారెంట్ డ్రైవ్-త్రూలో ప్రజలకు ఆహారం కూడా అందించాడు. ఈ సమయంలో, అతను ఒక కుటుంబంతో కూడా మాట్లాడాడు. దీనికి మీరు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని వారికి చెప్పారు. ఇకపోతే , నేను ఇప్పుడు కమల కంటే 15 నిమిషాలు ఎక్కువ పనిచేశానని, నేను ఫ్రై కుక్‌గా పని చేయాలనుకుంటున్నానని.. అది ఎలా ఉంటుందో చూడడానికి అంటూ ట్రంప్ గత నెలలో ఇండియానా, పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార కార్యక్రమంలో హారిస్ మునుపటి ఉద్యోగాన్ని ప్రస్తావిస్తూ అన్నారు.

ఇద్దరు అభ్యర్థులు విజయాన్ని నిర్ధారించుకోవడానికి నవంబర్ 5 ఎన్నికలకు ముందు పెన్సిల్వేనియాలో తరచుగా సభలు ఇర్వహిస్తున్నారు. ట్రంప్, హారిస్ పెన్సిల్వేనియాపై వారి దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. ఇక్కడ వారి ఎన్నికల ప్రచారాన్ని బలోపేతం చేయడానికి ఇద్దరూ వందల మిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో హారిస్, ట్రంప్ మధ్య గట్టి పోటీ నెలకొంది.





Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments