డేవిడ్ వార్నర్ లైవ్ మ్యాచ్‌లో పుష్ప పాటకు స్టెప్పులేశాడు. ప్రపంచ కప్ 2023లో భాగంగా.. ఈరోజు ధర్మశాలలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో వార్నర్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పుష్ప స్టెప్పులు వేసి అభిమానులను సంతోషపరిచాడు. వార్నర్ డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Read Also: Manda Krishna Madiga: ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు ఇస్తే ఆ పార్టీకే మద్దతు..
బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు.. వార్నర్ పుష్ప చిత్రంలోని పాటపై అద్భుతమైన స్టెప్పులు చేస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. వార్నర్ మూమెంట్స్ ను చూసి స్టాండ్స్‌లో కూర్చున్న అభిమానులు ఆనందంతో కేకలు వేశారు. అయితే వార్నర్.. పుష్ప సినిమాలోని పాటపై స్టెప్పులు వేయడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు చేశాడు. అతను వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Read Also: Keedaa Cola : గ్రాండ్ గా జరగనున్న కీడా కోలా ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా రానున్న ఆ స్టార్ హీరో..
వార్నర్ ఇప్పటివరకు టోర్నీలో మంచి ఫామ్‌లో కనిపించాడు. ఈ వరల్డ్ కప్ లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అర్ధశతకం సాధించాడు. వార్నర్ 65 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేశాడు. అంతకుముందు నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగులు, పాకిస్థాన్‌పై 163 పరుగులు చేశాడు.
David Warner with ‘Pushpa Dance’.pic.twitter.com/cCRojAz7nw
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 28, 2023