Homeతెలుగు రాష్ట్రాలుCyber Crime : రూ.20 వేలు పంపి రూ.46 లక్షలు దోచేశారు-సైబర్ నేరగాళ్ల కొత్తరకం మోసం

Cyber Crime : రూ.20 వేలు పంపి రూ.46 లక్షలు దోచేశారు-సైబర్ నేరగాళ్ల కొత్తరకం మోసం


పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో మోసాలు

పార్ట్‌టైమ్ ఉద్యోగాల పేరుతో సైబర్‌ కేటుగాళ్లు రూ.1.45 లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఆన్‌లైన్‌ పార్ట్‌ టైమ్ జాబ్‌ ప్రకటన చూసి అందులో నెంబర్ ను సంప్రదించారు. చిన్న చిన్న టాస్క్‌లు పూర్తి చేస్తే డబ్బులు చెల్లిస్తామని సైబర్ నేరగాళ్లు ఓ టెలిగ్రామ్ గ్రూపులో చేర్చారు. టాస్క్‌ల పేరుతో పలు సంస్థలకు గూగుల్‌ రివ్యూలు ఇచ్చి, స్ర్కీన్‌షాట్‌లు పంపమని కోరారు. డబ్బు చెల్లించేందుకని బ్యాంకు అకౌంట్ వివరాలు తీసుకున్నారు. నమ్మకం కలిగించేందుకు ముందుగా కొంత డబ్బు పంపారు. టాస్క్ లకు పెద్ద మొత్తంలో డబ్బు కావాలంటే కొంత డబ్బు చెల్లించాలని నమ్మించాడు. దీంతో బాధితుడు పలు విడతలుగా రూ.1.45 లక్షలు చెల్లించాడు. ఆ తర్వాత స్పందనలేకపోవడంతో … మోసపోయానని గ్రహించి సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments