- రేపు ఉదయం 11 గంటలకు సీఆర్డీఏ 44వ అథారిటీ సమావేశం
- ఎల్పీఎస్ జోన్ 7, జోన్ -10లో మౌళిక వసతుల కల్పనకు అథారిటీ ఆమోదం
- రెండు రోజుల్లో అమరావతిలో పనులకు సీఆర్‌డీఏ టెండర్లు.
CRDA Meeting: రేపు ఉదయం 11 గంటలకు సీఆర్డీఏ 44వ అథారిటీ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే సమావేశానికి మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఎల్పీఎస్ జోన్ 7, జోన్ -10లో మౌళిక వసతుల కల్పనకు అథారిటీ ఆమోదం తెలపనుంది. ఇప్పటివరకూ రూ.45,249.24 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మరో రూ.2000 కోట్ల పైబడి పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలపనుంది. రెండు రోజుల్లో అమరావతిలో పనులకు సీఆర్‌డీఏ టెండర్లు పిలవనుంది. అమరావతి పనులు వేగవంతం చేసేందుకు వీలుగా వారానికోసారి ప్రభుత్వం అథారిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది.
Read Also: Maharashtra: ఫోన్ కొనేందుకు నిరాకరించిన తల్లి.. 15 ఏళ్ల బాలుడు ఆత్మహత్య..