Coimbatore Car Blast: 2022లో ఐఎస్ఐఎస్ ప్రేరేపిత కోయంబత్తూర్‌లో కారు బాంబు పేలుడు, ఐసిస్ రాడికలైజేషన్, రిక్రూట్మెంట్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వేగం పెంచింది. తమిళనాడులోని 21 ప్రాంతాల్లో ఎన్ఐఏ దాడులు చేసింది. నలుగురు అనుమానితులను అరెస్ట్ చేసింది. శనివారం నిర్వహించిన యాంటీ టెర్రర్ ఏజెన్సీ సెర్చ్ ఆపరేషన్‌లో భారీ సంఖ్యలో ఎలక్ట్రానిక్ పరికరాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఆరు ల్యాప్‌టాపులు, 25 మొబైల్ ఫోన్లు, 34 సిమ్ కార్డులు, ఆరు ఎస్డీ కార్డులను, మూడు హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Sundeep Kishan: ముగ్గురు హీరోయిన్స్ తో బ్రేకప్ గ్రేట్ కాదు.. సీక్రెట్ గా మెయింటైన్ చేశావ్ చూడు
మద్రాస్ అరబిక్ కాలేజ్, కోవై అరబిక్ కాలేజీకి సంబంధించిన 11 ప్రదేశాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. అరబిక్ తరగతుల వేషంలో హింసాత్మక ప్రచారం, యువతను రాడికలైజేషన్, జిహాద్‌ని ప్రోత్సహిస్తున్నట్లు తేలింది. ఖిలాఫత్, ఐసిస్ సిద్ధాంతాలను ప్రచారం చేయడానికి ఐసిస్ కార్యకర్తలు తరగతులను నిర్వహించడంతో పాటు సోషల్ మీడియా ద్వారా ఉగ్రవాదానికి పాల్పడున్నట్లు ఎన్ఐఏ పేర్కొంది. పేలుడు కేసులో అరెస్టయిన 10 మంది నిందితులకు కోయంబత్తూరులోని కోవై అరబిక్ కాలేజీతో సంబంధం ఉన్నట్లు ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది.
కారుబాంబు కేసుతో సంబంధం ఉన్న మరో 10 చోట్ల ఎన్ఐఏ శనివారం ఏకకాలంలో సోదాలు నిర్వహించాయి. 2019లో శ్రీలంక కొలంబో దాడుల్లో 250 మంది మరణానికి కారణమైన శ్రీలంక ఉగ్రవాది జహ్రాన్ హషీమ్‌ని నిందితులు ప్రశంసించినట్లు దర్యాప్తులో తేలినట్లు ఎన్ఐఏ తెలిపింది. పట్టుబడిన ఉగ్రవాదులను జమీల్ బాషా ఉమరి, మౌల్వీ హుస్సేన్ ఫైజీ అలియాస్ మహ్మద్ హస్సేన్ ఫైజీ, ఇర్షాత్, ఇర్షాత్‌లు ఇద్దరు అరబిక్ కాలేజ్ పూర్వ విద్యార్థులుగా తేలింది. నాలుగో వ్యక్తిని సయ్యద్ అబ్దుల్ రెహ్మా్న్ ఉమారీగా గుర్తించారు.