Homeతెలుగు రాష్ట్రాలుCM Revanth Reddy : ప్రభాస్‌ లేని బాహుబలిని ఊహించలేం.. ప్రభాస్‌ హాలీవుడ్‌తో పడేలా రాణిస్తున్నారు

CM Revanth Reddy : ప్రభాస్‌ లేని బాహుబలిని ఊహించలేం.. ప్రభాస్‌ హాలీవుడ్‌తో పడేలా రాణిస్తున్నారు


CM Revanth Reddy : ప్రభాస్‌ లేని బాహుబలిని ఊహించలేం.. ప్రభాస్‌ హాలీవుడ్‌తో పడేలా రాణిస్తున్నారు

క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో అన్ని రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉందని, రాజులు ఏ రంగంలోనైనా రాణిస్తారు.. ఇందుకు వారి శ్రమ,పట్టుదలే కారణమన్నారు. సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్ణంరాజు అని, ఇప్పుడు హాలీవుడ్ తో పోటీ పడేలా రాణించిన బాహుబలి ప్రభాస్ అని ఆయన వ్యాఖ్యానించారు. కఠోరమైన శ్రమ, పట్టుదల కారణంగానే వివిధ రంగాల్లో క్షత్రియులు రాణించారన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బోసురాజు అత్యంత క్రియాశీల పాత్ర పోషించారని, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోయినా పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేశారన్నారు. పార్టీ కోసం కష్టపడిన బోసురాజు ని రాహుల్ గాంధీ గారు గుర్తించారని, వారి నిబద్ధతకు ప్రాధాన్యతనిస్తూ వారిని మంత్రిని చేశారన్నారు. నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు ఉంటుందనడానికి బోసురాజు, శ్రీనివాస వర్మ ఒక ఉదాహరణ అని, మీలో రాజకీయాల్లో రాణించాలని ఉన్నవాళ్లను మీరు ప్రోత్సహించండన్నారు.

 
Sivaji-Laya: మరోసారి జంటగా శివాజీ-లయ.. 14 ఏళ్ల తర్వాత..
 

వారికి తప్పకుండా అవకాశం కల్పిస్తామని క్షత్రియ సోదరులకు మాట ఇస్తున్నా అని ఆయన అన్నారు. మీ తరపున తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారుగా శ్రీనివాస రాజు ఉన్నారని, మీ సమస్యలను వారి ద్వారా నా దృష్టికి తీసుకురండన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా..’ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కో చైర్మన్ గా శ్రీని రాజును నియమించాం.. ఇది క్షత్రియులపై మాకున్న నమ్మకానికి నిదర్శనం.. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ స్పూర్తితో మేం ప్రజా సమస్యలపై కొట్లాడాం.. హైదరాబాద్ అభివృద్ధిలో క్షత్రియులు కూడా భాగస్వాములే. క్షత్రియులకు తప్పకుండా గుర్తింపు ఉంటుంది. ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని రాజులందరికి నేను పిలుపునిస్తున్నా.. రండి.. ప్రభుత్వం మీకు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంది.. క్షత్రియ భవన్ కు కావాల్సిన స్థలం, అవసరమైన సహకారం మా ప్రభుత్వం అందిస్తుంది.’ అని సీఎం రేవంత్‌ రెడ్డి.

 Komatireddy Venkat Reddy : మునిగిపోయిన పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు..





Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments