9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంపు
“2019-2024 మధ్య ఒక అసమర్థుడు వచ్చి విద్యుత్ రంగం అప్పు 1 లక్షా 29 వేల ఐదు వందల కోట్లు చేశాడు. 9 సార్లు విద్యుత్ ఛార్జీల బాదుడు ఇందుకే.. 2019-2024 మధ్య తన స్వార్ధ ప్రయోజనాల కోసం, పీపీఏలని రద్దు చేసి, పెట్టుబడిదారులపై కక్ష సాధించి, ప్రపంచ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బ తీశారు. 5 ఏళ్లు సీఎం ఆఫీస్ కి కూడా వచ్చినట్టు లేరు.. ఆ గదిలో కమోడ్ లు, ఏసీలు కూడా పని చేయని పరిస్థితి. పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు.. చేతకాని పరిపాలన వల్ల, గత 5 ఏళ్లలో విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టం రూ.47,741 కోట్లు” – సీఎం చంద్రబాబు