“లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగింది అని భక్తులు చెపుతున్నారు. ఇది ఎల్లప్పుడూ, పూర్తిగా కొనసాగాలి…మరింత మెరుగుపడాలి. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడండి….అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలి. తిరుమలలో విఐపీ సంస్కృతి తగ్గాలి…ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకూడదు. సింపుల్ గా, ఆధ్యాత్మిక ఉట్టిపడేలా అలంకరణ ఉండాలి….ఆర్భాటం, అనవసర వ్యయం వద్దు” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.