బుల్లితెర పై టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్ సిఐడీ కూడా ఒకటి.. ఈ సీరియల్ యువతను బాగా ఆకట్టుకుంది.. ప్రతి నటించిన ప్రతి ఒక్కరు కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.. అందులో ప్రణీత్ అలియాస్ ఫ్రెడ్రిక్స్ పాత్రలో నటించిన నటుడు దినేష్ ఫడ్నిస్ కామెడితో కడుపుబ్బా నవ్వించారు.. తాజాగా ఈయన గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. పరిస్థితి విషమంగా ఉందని వెంటిలేటర్ పై చికిత్సను అందిస్తున్నారు..
అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబరు 1న ఆయనకు గుండెపోటు వచ్చిందని.. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఆయనను ముంబైలోని ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందుస్తున్నారని.. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న నటీనటులు ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటున్నారు. సీఐడీలో దయా పాత్రను పోషించిన దయానంద్ శెట్టి, దినేష్ ఆరోగ్యం గురించి అప్‌డేట్ సోషల్ మీడియాలో షేర్ చేశారు..
అంతేకాదు ఆయన ఆరోగ్యం ఇప్పుడిప్పుడే మెరుగు పడుతుందని ఫ్యాన్స్ ఆందోళన చెందవద్దని తెలిపారు.. దినేష్ శరీరం చికిత్సకు స్పందిస్తుందని.. దినేష్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని అన్నారు.’CID’లో ఫ్రెడరిక్స్ పాత్రను పోషించడం ద్వారా దినేష్ కు మంచి గుర్తింపు వచ్చింది. దాదాపు 20 ఏళ్ల పాటు ఈ షోలో నటించాడు.. ఇక దినేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందరితో చిట్ చాట్ చేస్తూ ఉంటాడు..