సమాజాన్ని రక్షించి, దుష్టుల్ని శిక్షించమని
కనకదుర్గమ్మ శక్తి స్వరూపిణి అని.. సమాజాన్ని రక్షించి దుష్టుల్ని శిక్షించమని అమ్మవారిని ప్రార్ధించానని చంద్రబాబు చెప్పారు. మానవ సంకల్పానికి దైవ సహాయం ఎంతో అవసరమనే తొలుత దైవదర్శనాలు చేస్తున్నానన్నారు. తనకు కష్టం వచ్చినప్పుడు న్యాయం కోసం, ధర్మం కోసం దేశ విదేశాల్లో పోరాటాలు చేశారన్నారు. అధికార యంత్రాంగం తమ ధర్మాన్ని నిర్వర్తించాలని చంద్రబాబు సూచించారు. దుర్గమ్మ ఆలాయినికి వచ్చిన చంద్రబాబుకు కేశినేని నాని, జనసేన నేత పోతిన మహేష్, పంచుమర్తి అనురాధ, అశోక్ బాబు, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు, బోండా ఉమా, మాగంటి బాబు, బుద్దా వెంకన్న తదితరులు స్వాగతం పలికారు.