Homeతెలుగు రాష్ట్రాలుBreakfast: బ్రేక్‌ఫాస్ట్ ఎగ్గొడుతున్నారా?.. మీ మెదడు పనితీరుపై దెబ్బ ..

Breakfast: బ్రేక్‌ఫాస్ట్ ఎగ్గొడుతున్నారా?.. మీ మెదడు పనితీరుపై దెబ్బ ..


  • ప్రస్తుతం బ్రేక్‌ఫాస్ట్ ఎగ్గొడుతున్న జనం
  • దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు
  • ముఖ్యమంగా మెదడుపై ప్రభావం
Breakfast: బ్రేక్‌ఫాస్ట్ ఎగ్గొడుతున్నారా?.. మీ మెదడు  పనితీరుపై  దెబ్బ ..

ఆధునిక జీవన శైలిలో భాగంగా రాత్రిళ్లు ఆలస్యంగా పడుకోవడం, ఉదయం పొద్దెక్కేదాకా నిద్రలేవక పోవడం మామూలు వ్యవహారమైపోయింది. కొందరు వృత్తిరీత్య ఆలస్యంగా నిద్రిస్తే మరికొందరు రాత్రిళ్లు సరదాగా తిరుగుతూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారు. వీరు ఉదయం లేచే సరికి మధ్యాహ్నం కావడంతో టిఫిన్ తినడం కుదరదు. కొందరు ఉదయం హడావిడిగా ఆఫీసులకు వెళ్లే క్రమంలో అల్పాహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా ఖాళీ కడుపుతో ఉండటం వల్ల పనిమీద ఆసక్తి తగ్గిపోవడం, చిరాకు పెరగడం వంటి మానసిక సమస్యలు కూడా వస్తుంటాయి. శరీరానికి అవసరమైన పోషకాలు కూడా లోపిస్తాయి. ఇంతే కాకుండా ఓ అధ్యయనం ప్రకారం.. ఉదయం అల్పహారం మానేయడం వల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుందట.

READ MORE: China: మిలియన్ డ్రోన్‌లను ఆర్డర్ ఇచ్చిన చైనా.. భారత్‌కి కొత్త ముప్పు..

రాత్రంతా తినకుండా ఉన్న తర్వాత, ఉదయాన చేసే అల్పాహారం రోజంతా కావాల్సిన శక్తిని అందిస్తుంది. కానీ, మనలో చాలా మంది ఉదయాన బ్రేక్‌ఫాస్ట్ తినడాన్ని మానేస్తారు. బ్రేక్‌ఫాస్ట్ తినకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పడిపోతాయి. ఇది మెదడుపై ప్రభావం చూపుతుంది. రోజూ బ్రేక్‌ఫాస్ట్ తినకపోవడం వల్ల మెదడుకు నష్టం కలుగుతుంది. మెదడులోని కణాల సామర్థ్యం తగ్గిపోతుంది. పోషకాల లేమి వల్ల మెదడు సాధారణ పనితీరు దెబ్బతింటుంది.

READ MORE: Safety Tips: పొగమంచు కమ్మేస్తోంది.. వాహనదారులు ఈ జాగ్రత్తలు తీసుకోండి..

అంతే కాకుండా .. మెదడుకు అత్యంత తీవ్ర నష్టం తగినంత నిద్ర లేకపోవడం వల్లే జరుగుతుందని న్యూరాలజీ అండ్ వెల్‌నెస్ సెంటర్ ఆఫ్ అమెరికా వెల్లడించింది. పెద్దలకు తగినంత నిద్ర అంటే రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకోవాలని సూచించింది. రాత్రి పూట నిద్రపోతే మరింత మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. నిద్రపోగానే మెదడు విశ్రాంతి తీసుకుంటుంది. నిద్రలోనే మెదడు కొత్త కణాలను సృష్టిస్తుంది. ఏడు గంటల నిద్రలేకపోతే కొత్త కణాలు ఏర్పడవు. ఫలితంగా, మీరు ఏ విషయాన్నీ గుర్తుంచుకోలేరు. ఏకాగ్రత కుదరదు. చిరాకుగా ఉంటుంది. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. నిద్రలేమి వల్ల అల్జీమర్స్ వచ్చే ముప్పు పెరుగుతుంది.





Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments