- బ్రెజిల్లో క్రిస్మస్ వేళ విషాద ఘటన..
- ఇళ్లను ఢీకొట్టిన టూరిస్టుల విమానం..
- ప్రమాదంలో ఒకే కుటుంబంలోని 10 మంది మృతి..
Brazil Plane Crash: బ్రెజిల్లో క్రిస్మస్ పండగ ముందు మరో వివిషాద ఘటన చోటు చేసుకుంది. టూరిస్టులతో వెళ్తున్న విమానం కుప్పకూలిపోయింది. విమానం ఇళ్లను ఢీకొట్టి కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ప్యాసింజర్లు మృతి చెందారు. విమానం పడిన చోట బిల్డింగ్స్ లో ఉన్న మరో 17 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పర్యాటక పట్టణం గ్రామడోలో ఈ ఘటన జరిగింది.
Read Also: PM Modi: నేడు రోజ్‌గార్ మేళా.. 71 వేల మందికి నియామక పత్రాలను అందించనున్న ప్రధాని మోడీ
అయితే, బ్రెజిలియన్ సివిల్ డిఫెన్స్ అధికారులు వివరాలు తెలిపారు.. చిన్న విమానం తొలుత ఓ బిల్డింగ్‌ను ఢీకొట్టింది.. ఆ తర్వాత అందులో కింది ఫ్లోర్లో ఉన్న మొబైల్ ఫోన్లు అమ్మే షాపులోకి అది దూసుకుపోవడంతో.. విమానంలో ఉన్న ప్రయాణికులందరూ సంఘటన ప్రదేశంలోనే మరణించారు. అయితే, గ్రామడో పర్వత ప్రాంతంలోని పాపులర్ టూరిస్టు డెస్టినేషన్‌గా ఉంది. ఇది పర్యాటకులకు చాలా ఇష్టమైన ప్రదేశం అని అధికారులు తెలిపారు. మరికొన్ని రోజుల్లో క్రిస్మస్ వేడుకల నేపథ్యంలో ఇక్కడికి టూరిస్టుల తాకిడి పెరిగిందని సూచించారు.