అనంతరం అర్చకులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భువనేశ్వరితో పాటు తెదేపా ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. భువనేశ్వరిని కలిసేందుకు వచ్చిన స్థానికులు, తెదేపా కార్యకర్తలను పోలీసులు ఆలయానికి దూరంగా పంపించారు. శ్రీవారి దర్శనం అనంతరం భువనేశ్వరి నారావారిపల్లెకు వెళ్లారు.