- ‘దేవకి నందన వాసుదేవ గా వస్తున్న అశోక్ గల్లా
- సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్
- మాస్ యాక్షన్ అవతార్ లో కనిపిస్తున్న అశోక్
సూపర్ స్టార్ కృష్ణ మనవడు మరియు మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా ‘హీరో’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతో అశోక్ కు మంచి మార్కులు పడ్డాయి. ఆ జోష్ తో మరో సినిమా స్టార్ట్ చేసాడు గల్లా అశోక్. రెండవ సినిమాగా మాస్ మరియు యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దేవకి నందన వాసుదేవ’తో వస్తున్నాడు. ఈ సినిమాలో మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. గుణ 369కు తెరకెక్కించిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.
Also Read : Gopichand: ‘విశ్వం’ ట్రైలర్ రిలీజ్.. సన్న పిన్ను ఛార్జర్ ఉందా..?
ఈరోజు చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించారు. దేవకీ నందన వాసుదేవ నవంబర్ 14న గురు పూర్ణిమకు ముందు రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. విడుదల తేదీ పోస్టర్‌లో అశోక్ గల్లా ఇంటెన్స్ లుక్ లో ఆకట్టుకున్నాడు. ఒక వైపు సాధువు మరియు మరొక వైపు విలన్ ను చూపిస్తూ బ్యాక్‌గ్రౌండ్‌లో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని చుపిస్తూ థీమ్ ఏంటో చెప్పారు మేకర్స్. సినిమాలో ఆధ్యాత్మిక అంశాలున్నాయని ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్‌లో తెలిసింది. మొదటి పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో ఇక నుండి రెగ్యులర్ అప్ డేట్స్ తో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అశోక్ గల్లా సరసన వారణాసి మానస కథానాయికగా నటిస్తోంది, దీనికి కథను హను-మాన్ ఫేమ్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అందించారు, సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందించారు.ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించగా, సినిమాటోగ్రఫీని ప్రసాద్ మూరెళ్ల మరియు రసూల్ ఎల్లోర్ నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరించారు.